కంగనా .. ఈ సారి ఇర్ఫాన్​ పఠాన్​ మీద పడింది..!

Update: 2021-05-14 07:30 GMT
బాలీవుడ్​ వివాదాస్పద నటి కంగనా రనౌత్​ ఈ సారి మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్​ మీద విరుచుకుపడింది.. కంగనా... నిత్యం ట్విట్టర్​ లో రచ్చ రచ్చ చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈమె పెట్టే ట్వీట్లు భరించలేక.. ట్విట్టర్​ యాజమాన్యమే కొద్దిరోజులు ఈమె అకౌంట్​ ను బ్లాక్​ చేసేసింది. ఇటీవలే ట్విట్టర్​ అకౌంట్​ ఓపెన్​ అయినట్టు ఉంది.. మళ్లీ రంగంలోకి దిగిన కంగనా ట్వీట్లతో రెచ్చగొడుతోంది. నిత్యం బీజేపీకి, జాతీయవాదానికి ఆమె అనుకూలంగా ట్వీట్లు పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఈ ట్వీట్లు శృతి మించుతుంటాయి. ఇతరులను కించపరిచేలా.. కూడా ఆమె ట్వీట్లు పెడుతూ ఉంటుంది.

మరికొన్ని సార్లు నిరాధారమైన ఆరోపణలు కూడా చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సార్లు వివాదాల్లో చిక్కుకున్న కంగనా.. తాజాగా మరోసారి ట్విట్టర్​ వార్​ కు తెరలేపింది. ఈసారి మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్​ ను ఆమె టార్గెట్​ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధం కంగనా.. ఇర్ఫాన్​ పఠాన్​ మధ్య చిచ్చు రేపాయి..  ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇర్ఫాన్​ పఠాన్​ ఓ ట్వీట్ చేశాడు.

"నేను పాలస్తీనాకు మద్దతు తెలపడం లేదు. పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న విధ్వంసకాండను తప్పు బడుతున్నా. మీకు కొంచెం మానవత్వం కూడా ఉంటే, పాలస్తీనాలో ఏమి జరుగుతుందో తెలుస్తుంది. మీరు మద్దతు ఇవ్వండి" అంటూ ట్వీట్‌ చేశాడు.దీంతో కంగనా రనౌత్​ కు చిర్రెత్తుకొచ్చింది.‘ఇర్ఫాన్​ పఠాన్​ కు ఈ దేశంలో జరుగుతున్న హింస ఏ మాత్రం పట్టదు. ఇటీవల బెంగాల్​ లో దీదీ గెలుపొందాక.. ఎన్నో దాడులు జరిగాయి..  ఆ దాడులపై ఇర్ఫాన్​ పఠాన్​ ఒక్క మాటైనా మాట్లాడాడా? లేదు? కానీ ఇప్పుడు వేరే దేశం మీద ఆయనకు ఎందుకుంత ప్రేమ’ అంటూ కంగనా అతడి  ట్వీట్​   కు కౌంటర్​ ఇచ్చాడు.

దీనికి ఇర్ఫాన్​ కూడా మళ్లీ కౌంటర్​ ఇచ్చాడు. 'నేను కేవలం మానవత్వం తో మాత్రమే మాట్లాడా. అంతుకు మించి నాకు ఏ ఉద్దేశ్యం లేదు. కానీ కంగనా మాత్రం నిత్యం దురుద్దేశ్యాలతో మాట్లాడుతుంది. అందుకే ఆమె అకౌంట్​ ను ట్విట్టర్​ వాళ్లు కూడా బ్లాక్ చేశారు’ అంటూ ఫైర్​ అయ్యాడు పఠాన్​. మరోవైపు ఇటు బీజేపీ అభిమానులు, పఠాన్​ ఫ్యాన్స్​ కూడా ఒకరిపై ఒకరు సోషల్​ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News