సింగిల్ గా వస్తా కాస్కో.. పిన్నెళ్లికి బోండా ఉమ సవాల్

Update: 2020-03-13 06:15 GMT
స్థానిక ఎన్నికలు రావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా మాచర్లలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలపై దాడి జరగడంతో అధికార పార్టీ - వైఎస్సార్సీపీల మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. దీంతో అధికార పార్టీ, -ప్రతిపక్ష నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా - గుంటూరు జిల్లాల్లో పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే - ప్రభుత్వ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి - మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మధ్య సవాళ్లు - ప్రతి సవాళ్లు వస్తున్నాయి. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సమయంలో బాధితుడు - మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అధికార పార్టీ వైఎస్ ఆర్సీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. జెడ్పీటీసీ - ఎంపీటీసీ స్థానాలు పొందేందుకు వైఎస్సార్సీపీ అక్రమాలు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా బెజవాడోళ్లు ఎవరి రుణం ఉంచుకోరంటూ.. స్పష్టం చేస్తూ ఇలాంటి వాతావరణంలో తాను మరోసారి పల్నాడు ప్రాంతానికి వెళ్తానని ప్రకటించారు. ఈ సారి తాను మాచర్లకు సింగిల్‌ గా వెళ్తానని - దమ్ముంటే తన పర్యటనను అడ్డుకోవాలని బోండా ఉమామహేశ్వర రావు సవాల్ విసిరారు. ఇద్దరు నాయకులపై 200 మందికి పైగా వైఎస్ ఆర్సీపీ నాయకులు - కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు దమ్ము - ధైర్యం ఉంటే తనను అడ్డుకోవాలని తెలిపారు. బెజవాడోళ్లు ఎవరి రుణం ఉంచుకోరని.. ఎవరి రుణాన్ని వారికి తీర్చేయడానికే తాను మాచర్లకు వెళ్తానని స్పష్టం చేశారు.

పల్నాడు ప్రాంతం లో పార్టీ పరంగా విద్వేషాలను రెచ్చగొట్టడానికే బోండా ఉమా సవాల్ విసురుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే - విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతి విమర్శ చేశారు. మాచర్లకే కాదు.. మొత్తం పల్నాడు ప్రాంతంలో బోండా ఉమా పర్యటించినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. ఘర్షణలు సృష్టించాలనే కారణంతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని ఈ సందర్భంగా పిన్నెల్లి చెబుతున్నారు.
Tags:    

Similar News