గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పరంపర కొనసాగుతోంది. తాజా మరో ఎన్నికకు తెర లేచింది. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్లతో పాటు.. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీకి ఎన్నికల నగరా మోగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. తాజాగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ సోమవారం (ఫిబ్రవరి 22) నుంచి మార్చి 9 (బుధవారం) వరకు సాగనుంది.
నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఫలితాల వెల్లడికి మధ్య రెండు వారాల సమయం ఉంది. ఈ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. తాజా ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం కేటాయించగా.. ప్రచారానికి ఏడు రోజుల సమయం ఉండనుంది.
తాజాగా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ చూస్తే..
ఫిబ్రవరి 22 ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ జారీ. నామినేషన్ల ప్రక్రియ షురూ.
ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 25 నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 26 నామినేషన్ల ఉపసంహరణ. మధ్యాహ్నం 3 గంటలకు తుది జాబితా విడుదల
మార్చి 06 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
మార్చి 09 ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి