శనివారం ఉదయం 7 గంటలకు వరంగల్ లోక్ సభా స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ షురూ అయ్యింది. ఈ నేపథ్యంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..
= ఉప ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు నియోజకవర్గ ఓటర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
= ఈ ఎన్నికలకు సంబంధించి ఓటు వేసేందుకు వచ్చిన తొలి ఓటరుకు జిల్లా కలెక్టర్ కరుణ బొకే ఇచ్చి స్వాగతం పలికారు. వరంగల్ లోని ఒక పోలింగ్ బూత్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
= భూపాల పల్లి పట్టణంలోని 17వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పని చేయకుండా మొరాయించింది.
= తొర్రూరు మండలం వెలికట్టె పంచాయితీ పరిధిలోని పీక్యా తండాలో పోలింగ్ షురూ కాలేదు. పోలింగ్ ను గిరిజనులు బహిష్కరించటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు ఒక్కరు కూడా రాకపోవటం గమనార్హం. తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోని కారణంగా వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
= తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. తాజా వరంగల్ ఉప ఎన్నికకు కారణమైన కడియం శ్రీహరి తన ఓటుహక్కును వడ్డేపల్లిలో వినియోగించుకున్నారు.
= వరంగల్ కు చెందిన ముఖ్యనేతలైన టీటీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరిలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
= టీఆర్ ఎస్ అభ్యర్థి దయాకర్ తన ఓటును ను సంగెం మండలం బొల్లికుంట పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు.
= పోలింగ్ సందర్భంగా పలుచోట్ల అధికారులు తొలిఓటర్లకు పువ్వులు పంచి పెట్టి ఓటువేసేందుకు స్వాగతించటం విశేషం.
= ధర్మసాగర్ లోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వద్ద గుర్తింపు కార్డు లేకపోవటంతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు.