చికాగో మెట్రోసిటీ ఓక్ బ్రూక్ ట్రస్టీగా వరంగల్ వాసి ఎన్నిక

Update: 2021-04-09 12:59 GMT
అమెరికాలో తెలుగు వెలిగింది. అక్కడ జరిగిన ఎన్నికల్లో వరంగల్ జిల్లా నర్సంపేట వాసి విజయం సాధించారు. ఈనెల 6న అమెరికాలోని చికాగో మెట్రోసిటీ (సబర్బన్) ఓక్ బ్రూక్ ప్రాంత ట్రస్టీ (కార్పొరేటర్ స్థాయి)కి జరిగిన స్థాయి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన డాక్టర్ సురేష్ రెడ్డి విజయం సాధించడం విశేషం.నర్సంపేటకు చెందిన ఎర్ర నరసింహారెడ్డి-పుష్పలీల కుమారుడైన డాక్టర్ సురేష్ నర్సంపేటలోనే 10వ తరగతి వరకు చదివాడు. కేఎంసీ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.

ఆ తర్వాత రేడియాలజిస్ట్ గా అమెరికా వెళ్లి అక్కడ పనిచేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా అమెరికా ప్రజలతో అనుబంధం పెంచుకొని అక్కడ ప్రముఖ రేడియాలజిస్ట్ గా రాణిస్తున్నారు.భారత అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇన్ డయాన్ ఆర్జిన్ పూర్వ అధ్యక్షుడిగా పనిచేసిన సురేష్ రెడ్డి కోవిడ్ సమయంలో అనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా స్థానిక ప్రజలతోపాటు ఇండియన్స్ కు దగ్గరయ్యారు.

ఈ క్రమంలోనే స్థానిక ప్రజల అభిమానం చూరగొన్నారు. తాను అందించిన సేవలు, స్థానిక ప్రజలతో ఉన్న అనుబంధం ఓక్ బ్రూక్ ప్రాంత ట్రస్టీగా విజయానికి కారణమైంది. ఈయనతోపాటు ఎన్నికల బరిలో ఉన్న తన బృంద సభ్యులు లారీ హర్మన్, జేమ్స్ పి.నాగ్లేను కూడా గెలిపించారని సురేష్ రెడ్డి తెలిపారు.
Tags:    

Similar News