సన్ రైజర్స్ గురించి వార్నర్ ఎమోషనల్ పోస్ట్.. వైరల్

Update: 2021-10-10 07:11 GMT
క్రికెట్ ఆటలో దిగ్గజం.. ఆస్ట్రేలియా టీంలో ఆయనొక విధ్వంసకర బ్యాట్మెన్. ఓపెనర్ గా  దిగాడంటే ఎదుటి జట్టకు ముచ్చెమటలు పట్టిస్తాడు. టీం మొత్తం ఈ క్రీడాకారుడిపై ఆధారపడిన రోజులూ ఉన్నాయి. అంతేకాకుండా ఒంటిచేత్తో జట్టును గెలిపించిన దాఖాలాలూ ఉన్నాయి. ఐపీఎల్ ఆటలోనూ తన ప్రతిభను కనబర్చాడు. దీంతో సన్ రైజర్స్ జట్టుకు సారధిగా మారాడు. ఆయన కెప్టెన్సీలో టీంను ముందుకు నడిపించాడు. అతనే డేవిడ్ వార్నర్... ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఎంతో అభిమానించే డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ కు గుడ్ బై చెప్పాడు. ఇక తాను ఈ ప్రాంచైజీ తరుపున ఆడలేనని బరువెక్కిన హృదయంతో ప్రకటించారు. ఇన్  స్ట్రాగ్రామం వేదికగా ఆయన చేసిన మెసేజ్ తో క్రికెట్ అభిమానులు షాక్ కు గురయ్యారు.

ఆస్ట్రేలియాకు టీ 20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్  డేవిడ్ వార్నర్ తాజాగా ఐపీల్ కు  గుడ్ బై చెప్పాడు.!! అయితే అంతకుముందు సన్ రైజర్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ జట్టుకు కెప్టెన్సీగా ఉన్న వార్నర్ ను మధ్యలోనే తొలగించింది. అతని స్థానంలో కేన్ విలియమ్స్ని నియమించింది. తాజాగా ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం ఒకే మ్యాచ్ గెలవడంతో సన్ రైజర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్లో స్లో బ్యాటింగ్ తో నిరాశ పరిచిన డేవిడ్ వార్నర్ ఓటమికి తాను బాధ్యత అని ప్రకటించాడు.

2016లో సన్ రైజర్స్ కు టైటిల్ అందించాడు. అలాగే ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన  ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ మొత్తంలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఘనత కూడా ఆయనదే. కానీ 2021 సీజన్లో మాత్రం దారుణంగా విపలమయ్యాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచుల్లో 193 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయినప్పటికీ ఇన్నింగ్స్ లో వార్నర్ మార్క్ కనిపించలేదు. దీంతో వార్నర్ స్థానంలో కెవిలియన్ వచ్చాడు. అతడు మూడు మ్యాచుల్లో 108 పరుగులు చేశాడు.

2018 సీజన్లో వార్నర్ పై బాల్ టాంపరింగ్ నిషేధం విధించారు. దీంతో ఆ ఏడాది వార్నర్ దూరంగా ఉన్నారు. ఆ సమయంలో కేన్ విలియమ్సన్ జట్టుకు సారధిగా ఉన్నారు. అయితే ఆ ఏడాది సన్ రైజర్స్ ఫైనల్ వరకు చేరింది. దీంతో కేన్ విజయమ్సన్ పై సన్ రైజర్స్ కు నమ్మకం కలిగింది. దీంతో అతనికి బాధ్యతలు అప్పగించాలని అప్పుడే నిర్ణయించుకొంది. అయితే వార్నర్ కు అవకాశం ఇచ్చి చూసినా అతడూ తన ఫర్ఫామెన్ష్లో విఫలమయ్యాడు. దీంతో అతడిని తప్పించింది.

సన్ రైజర్స్ అలా ప్రకటించినా తనకు తాను ఫామ్ కోల్పోయినట్లు భావించాడు వార్నర్. దీంతో ఇన్ స్ట్రాగ్రామం వేదికగా తన ఆవేదనను చెప్పాడు. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ సాగుతుండగా వార్నర్ ఓ పోస్టు పెట్టాడు. ‘నన్ను ఎంతగానో ఆదరించిన అభిమానులకు థ్యాంక్స్. మా టీం గెలవడానికి మీరే కారణం. మీతో చేసిన ప్రయాణం గొప్ప అనుభూతిని కలిగించింది. కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు ఎంతో బాధగా ఉంది. ఈరోజు జట్టు బాగా ఆడాలని కోరుకుంటున్నా..’ అని పోస్టు పెట్టాడు.

దీంతో సన్ రైజర్స్ అభిమానులు వార్నర్ పెట్టిన పోస్టుకు స్పందిస్తున్నారు. తరువాతి సీజన్లో బాగా రాణించాలని కోరుకుంటున్నామని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఐపీఎల్ నుంచి మమ్మల్ని విడిచి వెళ్లోద్దని అంటున్నారు. అయితే డేవిడ్ వార్నర్ తరువాతి సీజన్లో ఆడుతాడా..? లేదా..? అనేదానిపై క్లారి లేదు.
Tags:    

Similar News