రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో నుపూర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు కన్నయ్యలాల్ అనే వ్యక్తి తల నరికి కిరాతకంగా చంపారు.ఈ క్రమంలోనే మరో బీజేపీ మాజీ నాయకుడు నవీన్ కుమార్ జిందాల్ కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. జిందాల్ ను చంపుతామంటూ హెచ్చరించిన ఈమెయిల్ తనకు అందిందని బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్ పేర్కొన్నారు.
తనకు బెదిరింపులతో కూడిన మూడు ఈమెయిల్ లు వచ్చాయని జిందాల్ ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో తెలిపారు. పంపిన వ్యక్తి తన గొంతు కోస్తానని బెదిరించాడని తెలిపారు.
ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ ను చంపినట్లుగా నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారని.. నన్ను భయపెట్టేందుకు కన్హయ్యలాల్ ను చంపిన వీడియోను జత చేశారని జిందాల్ ట్వీట్ చేశారు.
గతంలో కమలేష్ తివారీలా చంపేస్తానని.. భూమిపై ఉన్న ఏ శక్తి అతడిని రక్షించలేదని బెదిరించారని తెలిపారు. నిందితులు తనను ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రావాలంటూ సవాల్ చేశారని చెప్పారు.
సస్పెండ్ చేయబడిన బీజేపీ ప్రతినిధి నుపూర్ శర్మ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనకు మద్దతుగా చేసిన వ్యాఖ్యపై వివాదం చెలరేగడంతో జిందాల్ బీజేపీ నుంచి తొలగించబడ్డారు. కొద్దిరోజుల క్రితం తాను ఎవరినైనా కలవడానికి వెళ్లినప్పుడు కొందరు వ్యక్తులు తనను వెంబడించారని జిందాల్ పోలీసులకు తెలిపారు.
ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య లాల్ ను తలనరికి దారుణంగా హత్య చేసిన ఇద్దరు ఇస్లామిక్ ఉగ్రవాదులు రఫీ మహ్మద్, అబ్దుల్ జబ్బార్ లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ కూడా పాకిస్తాన్ లో ఉగ్రశిక్షణ తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కన్నయ్య లాల్ హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది.