ఈ ఫోటో వెనుక అస‌లు విష‌యం తెలిస్తే అవాక్కే!

Update: 2019-05-05 06:06 GMT
ఈ ఫోటో చూశారుగా. కిక్కిరిసిపోయిన ఈ స్టేడియం ఏ ఐపీఎల్ మ్యాచ్ కో.. మ‌రే రాజ‌కీయ పార్టీకి సంబంధించిందో.. అవార్డుల ఫంక్ష‌నో.. సినిమా కార్య‌క్ర‌మం కాదు. కాక‌లు తీరిన బిజినెస్ మ్యాన్ చేసే ప్ర‌సంగాన్ని వినేందుకు అన్ని వేల మంది వ‌చ్చిన వైన‌మిది. టీవీల్లో లైవ్ టెలికాస్ట్ అవుతున్నా.. స్టేడియంకు వ‌చ్చి.. ఆయ‌న్ను ప్ర‌త్య‌క్షంగా చూసే అవ‌కాశం కోసం వారంతా త‌పిస్తుంటారు. వేలాది మందిని అంత‌లా ఆక‌ర్షించే ఆ వ్యాపార దిగ్గ‌జం మ‌రెవ‌రో కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా విశిష్ట మ‌దుప‌రిగా పేరున్న వారెన్ బ‌ఫెట్ స‌భ‌.

ఆయ‌న మాట‌లు విన‌టానికి ఇంత భారీగా విచ్చేసిన వారిలో సామాన్యులు చాలామంది ఉన్నారంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఈ స‌భ‌కు హాజ‌రైన వారంతా కూడా బ‌ఫెట్ కంపెనీలో మ‌దుపుదారులే కావ‌టం ఒక ఎత్తు అయితే.. ప్ర‌తి ఏటా నిర్వ‌హించే వార్షిక స‌ద‌స్సుకు హాజ‌రు ఈ స్థాయిలో ఉంటుంది.

నిజానికి ఇంత భారీగా హాజ‌రు కావ‌టం కొత్తేం కాదు. వారెన్ బ‌ఫెట్ కు అల‌వాటే. కొన్నేళ్లుగా ఈ వ్య‌వ‌హారం సాగుతూనే ఉంటుంది. ప్ర‌తి ఏటా మాట్లాడినా.. ఈసారి ఇంకేమైనా ప్ర‌త్యేకంగా మాట్లాడ‌తారా? అన్న ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ ఉంటుంది. ఆయ‌న మాట‌ల్ని శ్ర‌ద్ద‌గా ఆల‌కించి.. వాటిని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేసి కోట్లాది రూపాయిల లాభాన్ని గ‌డించినోళ్లు ఎంతోమంది ఉన్నారు. అందుకే.. వారెన్ బ‌ఫెట్ స‌భ అంటే చాలు జ‌నం పోటెత్తుతుంటారు. తాజాగా వారెన్ బ‌ఫెట్ కంపెనీకి చెందిన వార్షిక వాటాదార్ల స‌మావేశం జ‌రిగింది. ఎప్ప‌టిలానే ఆయ‌న స‌భ‌కు వాటాదారులు పోటెత్తారు.

దాదాపు ఆరు గంట‌ల పాటు సాగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప‌లువురు వాటాదార్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కంపెనీ ఛైర్మ‌న్.. సీఈవో.. వారెన్ బ‌ఫెట్.. కంపెనీ వైస్ ఛైర్మ‌న్ చార్లీ ముంగ‌ర్ లు బ‌దులిచ్చారు. ఇంత‌కీ వాటాదారులు అడిగిన ప్ర‌శ్న‌ల్లో కీల‌క‌మైన‌వి.. ఆస‌క్తిక‌ర‌మైన‌వి చూస్తే..

+  యాపిల్‌ నియంత్రణపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటికీ ఆ కంపెనీ షేరుపై సానుకూల ధోరణితోనే ఉన్నాం.  తక్కువ ధర వద్ద మరిన్ని షేర్లను కొనుగోలు చేస్తాం.

+  క్రాఫ్ట్‌ హీంజ్.. ఇప్పటికీ మంచి వ్యాపారమే. ఆరేడేళ్ల క్రితం క్రాఫ్ట్‌, హీంజ్‌ విడిగా ఆర్జించిన లాభాల కంటే ఇప్పుడు క్రాఫ్ట్‌ హీంజ్‌ ఆదాయాలు మెరుగ్గానే ఉన్నాయి.

+  అమెజాన్‌ షేర్లు ఇప్పటికే బాగా పెరిగిపోయాయినిజ‌మే. వాటి షేర్ల‌నుకొన‌టం వెనుక  మా ఇన్వెస్టర్‌ మేనేజర్లలో ఒకరు తీసుకున్నారు.  వందల కంపెనీల షేర్లను ఇన్వెస్టర్‌ మేనేజర్లు నిర్వహిస్తున్నారు. అన్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్లు నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల అమెజాన్‌ షేర్లు కొనడం లాభదాయకమేనని భావిస్తున్నా.
Tags:    

Similar News