వారెన్ బ‌ఫెట్ ‘వార‌సుడు’ అత‌నే?

Update: 2021-05-04 14:30 GMT
ప‌ద‌కొండు సంవత్సరాల వయసులోనే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని.. ఆ త‌ర్వాత అందులోకి ప్రవేశించి.. అత్యున్న‌త స్థాయికి చేరిన వ్య‌క్తి వారెన్ బ‌ఫెట్‌. వ్యాపార రంగంలో ఆయ‌నొక శిఖ‌ర స‌మానుడిగా వెలుగొందారు. బిజినెస్ చేయ‌డాన్ని అమితంగా ఇష్ట‌ప‌డే వారెన్ బ‌ఫెట్‌.. త‌న సామ్రాజ్యాన్ని అంత‌కంత‌కూ విస్త‌రిస్తూ ముందుకెళ్లారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న విశ్రాంతి తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది.

ఎందుకంటే.. ఆయ‌న వ‌య‌సు 90 సంవ‌త్స‌రాలు మ‌రి. దీంతో.. బఫెట్ వ్యాపార సామ్రాజ్యమైన ‘బెర్క్ షైర్ హాత్ వే’ను ముందుకు న‌డిపించే వార‌సుడు ఎవ‌ర‌నే చ‌ర్చ కొంత కాలంగా కొన‌సాగుతూనే ఉంది. అయితే.. ఇన్నాళ్ల‌కు బ‌ఫెట్ స‌రైన వార‌సుడిని గుర్తించిన‌ట్టు స‌మాచారం.

అత‌నే గ్రెగ్ అబెల్‌. ‘బెర్క్ షైర్ హాత్ వే’ వైస్ ప్రెసిడెంగ్ గా ఉన్న ఇత‌న్నే బ‌ఫెట్ వార‌సుడిగా ప్ర‌క‌టించిన‌ట్టు తెలుస్తోంది. అబెల్ వార‌స‌త్వాన్ని కంపెనీ బోర్డు కూడా అంగీక‌రించింద‌ని బ‌ఫెట్ తెలిపిన‌ట్టు స‌మాచారం. ఇక‌పై బెర్క్ షైర్ హాత్ వేను గ్రెగ్ అబెల్ ముందుకు తీసుకెళ్ల‌బోతున్నారు. దీంతో.. బ‌ఫెట్ బిజినెస్ వ‌ర‌ల్డ్ ను కొత్త సార‌ధి ఎలా నిర్వహిస్తారోననే ఆస‌క్తి నెల‌కొంది.
Tags:    

Similar News