వారెన్ బఫెట్...షేర్ మార్కెట్ ఆ మాటకొస్తే వ్యాపారం రంగంపై కనీస అవగాహన ఉన్నవారికి ఈ పేరు సుపరిచితం. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో లెజండరీగా పేర్కొనే అమెరికా దిగ్గజం. ఈ సక్సెస్ ఫుల్ పర్సనాలిటీకి భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కలిగింది. ఈ విషయాన్ని స్వయంగా వారెన్ బఫెట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. ``ఎవరైనా సరే విస్మరించడానికి వీల్లేని భారీ అవకాశాలున్న బ్రహ్మాండమైన మార్కెట్ భారత్``' అని మన దేశం గురించి ప్రశంసించాడు.
``భారత్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఓ అద్భుతమైన కంపెనీ ఉంటే చెప్పండి. రేపటికల్లా అక్కడే ఉంటాను`` అంటూ మన దేశ మార్కెట్‌పై తన ధీమాను వ్యక్తం చేశాడు. భారత్‌లో భవిష్యత్ తరం అంతా ఇప్పటి కంటే మరింత గొప్పగా జీవించగలుగుతారని బఫెట్ ప్రశంసించారు. భారత్‌లోని ఐఐటీ ఇంజనీర్లను మాత్రమే తాను నియమించుకుంటానంటూ లోగడ మైక్రోసాఫ్ట్ యజమాని బిల్ గేట్స్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ...`` మేథో సామర్థ్యాల దృష్ట్యా భారత్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉంది`` అని బఫెట్ ప్రశంసించారు. భారత్‌లో వ్యాపార పరంగా, నైపుణ్యాల పరంగా అత్యంత మెరుగైన అవకాశాలు ఉన్నాయని కొనియాడారు.
కాగా, సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్ అయినప్పటికీ తాను కొన్ని తప్పులు చేసినట్లు బఫెట్ అంగీకరించారు. ఐబీఎంకు బదులు గూగుల్ లేదా అమేజాన్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందంటూ తెలిపారు. టెక్నాలజీ స్టాక్స్‌ను విస్మరించడంపైనా విచారం వ్యక్తం చేశారు. వాటి విలువను మొదట్లోనే గుర్తించలేకపోయినట్టు చెప్పారు. బెర్క్‌షైర్ బీమా విభాగం అయిన 'గీకో' ప్రకటనల ప్రదర్శనకు గూగుల్ ఒక్కో క్లిక్‌కు 10, 11 డాలర్ల చార్జీ వసూలు చేసినప్పుడే అందులో పెట్టుబడులు పెడితే బాగుండేదని తన తప్పటడుగు పట్ల వ్యాఖ్యలు చేశారు.