సందేహం కలిగినప్పుడు సమాధానం కోసం అడగాల్సిన అవసరం ఉంటుంది. అందుకు సమయం.. సందర్భం కూడా చాలా అవసరం. కానీ.. అలాంటిదేమీ అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు ఇప్పుడు షాకిచ్చేలా మారటమే కాదు.. రానున్న రోజుల్లో రాజకీయ రగడగా మారనుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దివంగత మహానేత వైఎస్ మరణంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర ఉందన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తూ.. ‘కుట్ర’ కోణాన్ని బయటకు లాగారు వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన.. వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. తాజాగా ఆయన గుంటూరు జిల్లా పొన్నపల్లిలో మీడియాలో మాట్లాడిన సందర్భంగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన ఘటనకు సంబంధించిన అనుమానితుల్లో చంద్రబాబు ఒకరంటూ కొత్త రచ్చకు తెర తీశారు. వైఎస్ మరణంలో బాబు కుట్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యను చూసినప్పుడు.. వైఎస్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందా? అన్న అనుమానాలకు బలం చేకూరేలా ఉందన్నారు. ఏ ఉద్దేశంతో సీఎం జగన్ పై అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
మోపిదేవి చెప్పినట్లుగా.. వైఎస్ మరణంలో బాబు కుట్ర పన్ని ఉన్న అనుమానం ఉంటే.. గడిచిన రెండున్నరేళ్లుగా జగన్ సర్కారే అధికారంలో ఉంది. మరి.. తండ్రి మరణంపై లోతుగా విచారణ జరిపించి.. ఇప్పటివరకు బయటకు రాని కుట్ర కోణాల్ని వెలికి తీసి ఉంటే బాగుంటుంది కదా? అలాంటి ప్రశ్నలకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేసి.. కొత్త రచ్చ చేసుకోవాల్సిన అవసరం ఉందా? అధికారంలో ఉన్న వారికే అనుమానాలు ఉండటం కాసింత ఎబ్బెట్టుగా ఉండదంటారా?సున్నితమైన విషయాల్లో కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.