భస్మాసురుడి హస్తంలా మారింది అమెరికాలోని గన్ కల్చర్. పప్పు బెల్లాలు కొనుక్కున్నంత ఈజీగా చేతికి అయుధాలు ఇచ్చేసే అమెరికాలో.. ఇప్పుడా దేశానికి అదే శాపంగా మారింది. అసహనం హద్దులు దాటటం.. అవసరం ఉన్నా.. లేకుండా చిన్న విషయానికి డిప్రెషన్ కు లోను కావటం.. చేతిలో ఉన్న గన్ కి పని చెప్పటం.. నలుగురిని చంపటం.. చివరకు తాను చనిపోవటం లాంటివి అమెరికాలో ఈ మధ్యన తరచూ చోటు చేసుకుంటున్నాయి.
ఒక పరిశ్రమలో పెయింటర్ గా పని చేస్తున్న వ్యక్తి నిన్న (భారత కాల మాన ప్రకారం శుక్రవారం) తాను పని చేస్తున్న పరిశ్రమ ఆవరణలో ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపి నలుగురిని బలి తీసుకోవటం.. 30కి పైగా గాయాలుపాలు చేయటం తెలిసిందే. తీవ్ర కలకలాన్ని రేపిన ఈ ఉదంతం రక్తం మరకల తడి ఇంకా ఆరనేలేదు కానీ అప్పుడే మరో గన్ ఇష్టారాజ్యంగా పేలింది. వాషింగ్టన్ సమీపంలోని ఒక ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు ఇంట్లోని వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందాడు. అనంతరం ఆ ఆగంతకుడు కూడా తనను తాను కాల్చుకొని చనిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఒక అమ్మాయిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. పేరుకు పెద్దన్న రాజ్యమే కానీ.. ఏ నిమిషాన ఎవరి మీద ఎవరు గన్ పేలుస్తారో అర్థం కాని దుస్థితి.