ఇండియా గెలవనందుకు పాక్ రగిలిపోతోంది

Update: 2019-07-02 10:57 GMT
ఇండియా, పాకిస్తాన్.. రెండు శత్రుదేశాలు.. ప్రపంచకప్ క్రికెట్ లో ఇంతవరకు పాక్ మనపై గెలిచింది లేదు.ఎప్పుడు తలపడ్డా మనదే విజయం. ఇక ఇండియా ఓడిపోవాలని పాక్.. పాక్ ఓడిపోవాలని భారత్ కోరుకోవడం సహజమే. కానీ ఈ ప్రపంచకప్ వేళ భారత్ గెలవాలని పాక్ అభిమానులు కోరుకున్నారు. మద్దతు ప్రకటించారు. స్టేడియంలోకి వచ్చే కమాన్ భారత్ అంటూ ఉత్సాహపరిచారు.

అయితే ఇంత చేసినా భారత్ నెమ్మదిగా ఆడి ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఇంగ్లండ్ పై భారత్ గెలిచివుంటే పాకిస్తాన్ కు సెమీఫైనల్ రేసులో కలిసివచ్చేది.ఇప్పుడు ఇండియా ఓటమితో పాకిస్తాన్ సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. అందుకే శత్రుదేశమైనా భారత్ గెలవాలని పాక్ అభిమానులు, ఆదేశ క్రికెటర్లు ట్విట్టర్ - సోషల్ మీడియాలో పెద్ద ఎత్తును కామెంట్లతో హోరెత్తించారు. కానీ వారి ఆశ నెరవేరలేదు.

కాగా ఇండియా కావాలనే ఓడిపోయిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు - అభిమానులు - విశ్లేషకులు ఇప్పుడు సోషల్ మీడియాలో - మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  తాజాగా ప్రపంచకప్ కమెంట్రీ అవతారం ఎత్తిన వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ సెమీస్ చేరకూడదనే భారత్ జిడ్డుగా ఆడి తమ అవకాశాలను చెడగొట్టిందని విమర్శించారు.

ఇక తాజాగా పాక్ ప్రముఖ బౌలర్ వకార్ యూనిస్  టీమిండియా పై విమర్శలు గుప్పించారు. ప్రపంచకప్ లో అన్ని జట్లను ఓడిస్తూ చాంపియన్ ఆట ఆడిన టీమిండియా క్రిడాస్ఫూర్తికి విరుద్ధంగా ఇంగ్లండ్ పై ఆడి పాకిస్తాన్ సెమీస్ చేరకుండా కుట్రపన్నిందని సంచలన ఆరోపణలు చేశారు. కావాలనే ఇంగ్లండ్ పై ఇండియా ఓడిందని మండిపడ్డారు.

ఇక వీరే కాదు.. పాక్ క్రికెటర్లు - ప్రముఖులు - రాజకీయ నేతలు - అభిమానులు కూడా ఇండియా ఓటమి కావాలనే చేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News