నీటి ఫైట్: తెలంగాణపై గట్టిగానే స్పందిద్దామన్న జగన్

Update: 2020-10-03 05:45 GMT
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ పీక్స్ కు చేరింది. గోదావరి కృష్ణా నదులపై నీటి వాటా కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీ ముదిరింది. ఈ నెల 6న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఆధ్వర్యంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గట్టిగానే స్పందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులు, ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలపై ఈ భేటిలో చర్చింనున్నారు. తెలంగాణ లేవనెత్తే అంశాలపై ధీటుగానే బదులివ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రజంటేషన్ సిద్ధం చేయాలని.. తెలంగాణ నీటి వాడకంపై కేంద్రానికి పవర్ పాయింట్ ఇవ్వాలని జగన్ ఆదేశించారు.

నిన్న కేసీఆర్ కూడా తెలంగాణ నీటి వాటా-అపెక్స్ కౌన్సిల్ భేటిపై అధికారులతో సమీక్షించారు. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని నినదించాలని.. ఈ మేరకు ఘాటు లేఖ కూడా కేంద్రానికి రాశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే దేవుడినైనా ఎదురిస్తానని అన్నారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ నీటి వాటా కోసం ఫైట్ కు రెడీ కావడం.. తగ్గే సూచనలు లేకపోవడంతో ఈ పోరు రసవత్తరంగా మారింది. ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఎవరి వాదన నెగ్గుతుంది.? ఎవరు నిలబడుతారనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News