మనిషి సాంకేతికంగా ఎంత ముందంజ వేసినా.. ఎంత అభివృద్ధి చెందినా.. సుదూర గ్రహాల మీదకు రాకెట్లు పంపగలిగే స్థాయికి చేరినా ఇంకా విశ్వంలో ఎన్నో రహస్యాలు, వీడని మిస్టరీలు ఇంకా ఎన్నో పోగుపడే ఉన్నాయి. ఇప్పటికీ వాటికి కారణాలను ఏమిటో మనిషి కనిపెట్టలేకపోయాడు.
మీకు బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలిసే ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్లో ఇప్పటివరకు ఎన్నో విమానాలు, ఓడలు, హెలికాఫ్టర్లు మాయమయ్యాయి. మాయమైనవాటిని వెతుకుతూ గస్తీ విమనాలు, హెలికాఫ్టర్లు వెళ్లాయి. అవి కూడా మాయమయ్యాయి. ఇంతవరకు బెర్ముడా ట్రయాంగిల్ లో ఏం జరుగుతుందో కనిపెట్టలేకపోయారు.
ఇప్పుడు ఇలాగే మంచు ఖండంగా పేరున్న అంటార్కిటికాలోనూ ఒక మిస్టరీ వీడడం లేదు. అంటార్కిటికాలోని ఒక హిమనీనదం (గ్లేసియర్) నుంచి ఒక ఎర్రని ద్రవం బయటకు వస్తోంది. ఇది ఏమిటో.. ఎందుకు ఇలా ఎర్రని ద్రవం బయటకు వస్తుందో ఎవరూ చెప్పలేకపోయారు. సంవత్సరంలో 365 రోజులూ ఎల్లప్పుడూ మంచుతో నిండి ఉండే ప్రాంతం అంటార్కిటికా. ఇక్కడున్న విక్టోరియా ల్యాండ్‌లో బాగా గడ్డ కట్టిన జలపాతం టేలర్ గ్లేసియర్ ఉంది. దీని నుంచి రక్తం లాంటి చిక్కని ఎర్రటి ద్రవం వెలువడుతోందని అంటున్నారు. ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా రక్తంలాంటి ద్రవం వెలువడుతూనే ఉందని చెబుతున్నారు.
1911లోనే అంటార్కిటికాను సందర్శించిన బ్రిటిష్ అన్వేషకుడు థామస్ గ్రిఫిత్ టేలర్ తొలిసారిగా దీన్ని చూశారు. ఇక అప్పటి నుంచి ఈ హిమనీ నదానికి ఆయన పేరుతో టేలర్ గ్లేసియర్ అనే పేరు వచ్చింది.
మొదట్లో థామస్, అతని స్నేహితులు ఆ చిక్కటి ఎర్రటి ద్రవాన్ని రెడ్ ఆల్గే అని భావించారు. అయితే వారు ఊహించింది తప్పు అని తర్వాత కాలంలో స్పష్టమైంది.
ఇక ఆ తర్వాత 1960లో ఇంకో అధ్యయనం బయటకు వచ్చింది. హిమానీ నదం కింద ఇనుము లవణాలు, ఉప్పు నీరు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఫెర్రిక్ హైడ్రాక్సైడ్‌కు ఉప్పు నీరు కలవడంతో ఉష్ణం పుట్టిందని, ఆ వేడి వల్ల మంచు చీలి ద్రవం బయటకు వస్తోందని తేల్చారు. ఆ ద్రవం బయటకు వచ్చాక గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిగి ఎర్రగా మారుతోందని భావించారు.
ఆ తర్వాత మరో అధ్యయనం వెలుగుచూసింది. ఆ హిమానీ నదం కింద కొన్ని సూక్ష్మజీవులు జీవిస్తున్నాయని 2009లో గుర్తించారు. ఆ సూక్ష్మజీవులు 15 లక్షల సంవత్సరాల నుంచి 40 లక్షల సంవత్సరాలుగా ఈ హిమానీనదం క్రిందనే ఉన్నాయని సమాచారం.
అక్కడి నీటిని ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు.. అందులో అరుదైన సబ్‌గ్లాసియల్ ఎకోసిస్టమ్‌కు చెందిన బ్యాక్టీరియా ఉన్నట్లు వెల్లడైంది. ఆక్సిజన్ లేని ప్రాంతంలో ఆ బ్యాక్టీరియా కొన్ని లక్షల సంవత్సరాలుగా జీవిస్తోందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ ప్రాంతం గురించి, అక్కడి సూక్ష్మజీవుల గురించి మరింత క్షుణ్నంగా తెలుసుకోవడంతోపాటు పరిశోధనలు నిర్వహిస్తే గుట్టు వీడుతుందని భావిస్తున్నారు. అసలు ఈ భూమి మీద జీవం ఎలా, ఎప్పుడు మొదలైందో కూడా తెలుసుకోవచ్చని విశ్వసిస్తున్నారు.
అయితే మంచు ఖండంగా పేరున్న అంటార్కిటికాలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలుంటాయి. అలాగే వాతావరణం అనిశ్చితి ఉంటుంది. ఏ క్షణంలో వాతావరణంలో ఎలా మారిపోతుందో ఎవరూ అంచనా వేయలేరు. అప్పటికప్పుడు మంచు తుఫాన్లు చెలరేగుతుంటాయి. ఆక్సిజన్ ఉండదు. ప్రయాణించడానికి మార్గాలు కష్టమే. మరి ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల పరిశోధనలు అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో ఆ ఎర్రటి రక్త ప్రవాహం రహస్యం వీడుతుందో, లేదో వేచి చూడాల్సిందే.