ఆట తెలీకున్నా..68 గ‌జాల దూరం నుంచి గోల్ కొట్టేశాడు

Update: 2019-06-28 04:51 GMT
ఫుట్ బాల్ ఆట‌కు సంబంధించి సింఫుల్ గా చెప్పాలంటే.. రెండు జ‌ట్లు.. రెండు గోల్ పోస్టులు. ఫుట్ బాల్ ను కాలితో దొర్లుకుంటూ వెళుతూ .. ప్ర‌త్య‌ర్థి గోల్ పోస్టులో వేయ‌టంగా చెప్పొచ్చు. మిగిలిన లెక్కల్ని..రూల్స్ ను ప‌క్క‌న పెట్టేస్తే ఆట‌ను ఇలా చెప్పేయొచ్చు. ప్ర‌త్య‌ర్థి గోల్ పోస్టులో బాల్ వేసేందుకు.. ద‌గ్గ‌ర నుంచి కూడా బాల్ వేయ‌లేని ప‌రిస్థితి. అందుకు భిన్నంగా 68 గ‌జాల దూరం నుంచి కొట్టిన గోల్ ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడాభిమానుల మ‌న‌సుల్ని దోచేస్తోంది.

జట్టుతో సంబంధం లేకుండా.. స‌ద‌రు ఆట‌గాడి అద్భుత ప్ర‌తిభ‌కు ప్ర‌పంచం ఫిదా అయ్యే ప‌రిస్థితి. ఈ క్లిప్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. గోల్ పోస్ట్ కు ఏకంగా 68 గ‌జాల దూరం నుంచి గోల్ కొట్ట‌టం సామాన్య‌మైన విష‌యం కాదు. గురి త‌ప్ప‌ని ల‌క్ష్యం.. బాల్ మీద నియంత్ర‌ణ‌.. తాను గురి చూసి బాల్ కొడితే.. గురి త‌ప్ప‌ని బాణం ఎలా అయితే ల‌క్ష్యాన్ని చేధిస్తుందో.. అదే రీతిలో బాల్ వెళ్లి గోల్ పోస్ట్ లో ప‌డ‌టం అంత తేలికైనా విష‌యం కాదు.

కానీ.. ఆ అద్భుతాన్ని నిజం చేశాడు వేన్ రూనీ. ఒక‌ప్పుడు ఇంగ్లండ్ జాతీయ ఫుట్ బాల్ జ‌ట్టుకు ఆడిన అత‌డు.. రిటైర్ అయ్యాక క్ల‌బ్బులు.. లీగ్ ల‌లో ఆడుతున్నాడు. తాజాగా మేజ‌ర్ లీగ్ సాక‌ర్ లో డీసీ యునైటెడ్ కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. లాస్ ఏంజెల్స్ లోని ఓర్లాండో సిటీతో జ‌రిగిన మ్యాచ్ లో రూనీ ఏకంగా 68 గ‌జాల దూరం నుంచి గోల్ చేసిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌త్య‌ర్థి శిబిరం వైపు ఖాళీగా ఉండ‌టం.. గోల్ కీప‌ర్ సైతం సిద్ధంగా లేక‌పోవ‌టంతో సాహ‌సంతో అత‌గాడు బంతిని త‌ర‌లించిన వైనం అద్భుతంగా చెప్ప‌క త‌ప్ప‌దు. కావాలంటే.. ఈ వీడియో లింక్ చూస్తే వేన్ రూనీ ప్ర‌తిభ‌కు ఫిదా కావాల్సిందే.


Full View

Tags:    

Similar News