ఏపీలో రాజకీయం రసకందాయంగా మారుతోంది. జగన్ సంకల్పయాత్ర ముగుస్తుండడంతో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ఇంకా సమయమున్నా నాయకుల విమర్శలు ప్రచార సందడిని తలపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంలో పార్టీలు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. ఎప్పటికప్పుడు జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. నాయకులు కూడా ప్రత్యేక స్లోగన్స్ తో ప్రజల్లోకి వెళ్తారు. అయితే స్లోగన్సే కదా అని వాటిని తీసి పారేయ లేం. ఎందుకంటే పలు సందర్భాల్లో సక్సెస్ అయ్యాయి. గతంలో ‘బాబు రావాలి.. జాబురావాలి’ ‘బ్రింగ్ బ్యాక్ బాబు’ వంటి నినాదాలతో తెలుగుతు దేశం పార్టీ దూసుకెళ్లింది. అధికారం చేజిక్కించుకోవడంలో నినాదాలు కీలకమయ్యాయని చెప్పొచ్చు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ ఒక అడుగు ముందుకేసింది. క్యాచీ నినాదంతో జనంలోకి దూసుకెళ్లేందుకు సన్నద్ధమైంది. చంద్రబాబు జిమ్మిక్కులను నమ్మవద్దని పార్టీ అధినేత జగన్, నాయకులు సభలు, సమావేశాల్లో ప్రసంగిస్తున్నా బాబును టార్గెట్ చేసేందుకు పక్కా ప్రణాళికను రూపొందించారు.. ఇందులో భాగంగా ‘నిన్ను నమ్మం బాబు’ అనే స్లోగన్ తో జనంలోకి వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. వైఎస్ జగన్ చేపట్టిన సంకల్ప యాత్ర ఈ నెల 8న ముగియనుండడంతో వారం రోజులు సంఘీభావంగా క్షే్త్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రతీ నియోజకవర్గంలోనూ ‘నిన్ను నమ్మం బాబు’ అనే నినాదంతో పెద్ద హోర్డింగ్ ను పెట్టాలని వైసీపీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.. పార్టీ పంపించిన స్టిక్కర్లు ఉన్న వాహనాల్లోనే ప్రచారం చేయాలని పేర్కొంది. గ్రామాల్లో 500 మంది సమావేశాలు నిర్వహించాలని, ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమానికి మద్దతుగా 9121091210 కు మిస్డ్ కాల్ ఇప్పించాలని తెలిపింది. ఈ నెల 9 ఇచ్చాపురంలో నిర్వహించే జగన్ భారీ సభకు నియోజకవర్గాల నుంచి భారీగా తరలి రావాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. మొదటి నుంచి ఉద్యమ కార్యాచరణతో ప్రజల్లోకి దూసుకెళ్తున్న వైసీపీ తాజాగా ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభతో ప్రభంజనం సృష్టించ బోతోందనే విషయం స్పష్టమవుతోంది.
Full View