2025 తర్వాత డీజిల్, పెట్రోల్ కార్లు వద్దే వద్దు..ఆ దేశం నిర్ణయం!

Update: 2021-01-06 23:30 GMT
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కార్ల వినియోగం భారీగా పెరిగింది. మరో వైపు ఇంధన ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పుడు డీజిల్ కానీ పెట్రోల్ కానీ రెండూ  ధర దగ్గర దగ్గర లీటర్ వంద రూపాయల వరకూ పలుకుతున్నాయి. ఈ భారం మోయలేక  చాలామంది బ్యాటరీ వాహనాలను కొంటున్నారు. అందుకే నార్వే దేశం పెట్రోల్, డీజిల్ కార్ల ఉత్పత్తి నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. 2025 కల్లా క్రమంగా వాటి వినియోగం ఆపుతూ రావాలని నిర్ణయించింది.

 పెట్రోల్,  డీజిల్ కార్ల విక్రయాలను నిలిపివేసిన తొలి దేశంగా నిలవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేపట్టింది.  అందుకు అనుగుణంగా ఆదేశం  చర్యలు చేపట్టింది.  ప్రభుత్వం ప్రోత్సహించడంతో ఆ దేశ ప్రజలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెట్రోల్ డీజిల్ కార్లను భారీగా కొనుగోలు చేశారు.  ప్రపంచంలో కెల్లా టాప్ బ్యాటరీ వెహికల్ ప్రొడ్యూసర్ గా నిలిచిన టెస్లాను సైతం జర్మనీ ఆటో మేకర్స్ వోక్స్ వ్యాగన్ అధిగమించి నార్వేలో విద్యుత్ వాహనాల విక్రయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది.

 నార్వే పెట్రోల్ డీజిల్ ఆధారిత కార్ల కొనుగోలు పై భారీగా పన్నులు విధిస్తోంది. అదేసమయంలో విద్యుత్తు వాహనాల వినియోగానికి ప్రోత్సహిస్తోంది. అందుకు అనుగుణంగా పన్ను రాయితీలు కూడా ఇస్తోంది. అక్కడి ఆటోమొబైల్ ల్యాబ్ లు భవిష్యత్తులో ఇంటర్నల్ కంబుష్టన్ ఇంజిన్ లేకుండా కార్ల తయారీపై దృష్టి పెట్టాయి. గత ఏడాది నెలల వారీగా 50 శాతం విద్యుత్ కార్ల విక్రయాలు నమోదయ్యాయి. సంవత్సరం అంతానికి కార్ల మార్కెట్లో విద్యుత్ కార్ల వినియోగం 66.7 శాతంగా ఉందని నార్వే పర్కటించింది.

 ప్రస్తుతం ఎక్కువగా విద్యుత్ కార్లను  వినియోగిస్తున్న నార్వే ప్రజలు వోక్స్ వ్యాగన్ కు చెందిన  ఆడికి ఈ-ట్రోన్ కారును కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.  కొనుగోళ్లలో ఈ కారు అగ్రస్థానంలో ఉండగా,  టెస్లా మిడ్ సైజ్డ్ మోడల్ -3 కారు రెండో స్థానంలో నిలిచింది. రికార్డు స్థాయిలో ఇలా విద్యుత్ వాహనాలను విక్రయిస్తే 2025 విద్యుత్ కార్ల వినియోగంలో ప్రథమ స్థానంలో నిలుస్తామని నార్వే అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News