అరకు దాడి ఆధారాలు దొరికాయి: డీజీపీ

Update: 2018-09-27 06:19 GMT
ఎమ్మెల్యే కిడారి - మాజీ ఎమ్మెల్యే సోములను హత్య చేసిన మావోయిస్టుల ఆధారాలు దొరికాయనీ - నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. ఆదివారం  ఉదయం   ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన డుంబ్రిగూడ మండలం లిపిటిపుట్టులోని ప్రదేశాన్ని డీజీపీ  పరిశీలించారు. ఈ సందర్భంగా విశాఖ మన్యం - అరకులోయలో మావోయిస్టుల కదలికలు తగ్గిపోయినట్లు పోలీస్ వర్గాలు ఎప్పుడూ చెప్పలేదని ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలలో హత్య విషయంలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని.. దీన్ని ఒప్పుకుంటున్నామని డీజీపీ వివరించారు. దీనికి ఆంధ్రా-ఒడిషా సరిహద్దు (ఏవోబీ)లో సమస్యలే కారణమని విశ్లేషించారు. ఈ ఘటనపై తాము ఒడిషా డీజీపీ ఆర్పీశర్మతో కలిసి పనిచేస్తామని వివరించారు. డీజీపీతోపాటు ఇంటెలిజెన్స్ - విశాఖ జిల్లా ఎస్పీ కూడా సందర్శించారు. కాగా డీజీపీ రాకతో అడుగడుగునా భద్రతా చర్యలు పటిష్టం చేశారు. మన్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
Tags:    

Similar News