పవర్లోకి వచ్చిన తర్వాత ప్రతీకారమే.. అందరి అకౌంట్లు సెటిల్ చేస్తాం

Update: 2022-07-18 04:46 GMT
దేశంలోని అతి తక్కువ రాష్ట్రాలు.. ఆ మాటకు వస్తే వేళ్ల మీద కూడా లెక్క పెట్ట లేనన్ని తక్కువ చోట్ల ఉన్న రాజకీయ పరిస్థితులు ఏపీలో ఉన్న సంగతి తెలిసిందే. అధికార.. విపక్షాల మధ్య నిత్యం ఏదో ఒక రచ్చ.. రభస జరిగే రాష్ట్రంగా ఏపీ మారింది. ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు రావటం.. ఎక్కడో ఒకచోట పోలీసులకు ఫిర్యాదులు అందటం.. విపక్ష నేతల్ని రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా అదుపులోకి తీసుకోవటం లాంటవి తరచూ చోటు చేసుకుంటున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏపీలోని పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు.. తాము అధికారంలోకి వచ్చినంతనే అంతకంతకూ బదులు తీర్చుకుంటామన్న మాటను తరచూ చెబుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీడీపీ నేతలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో.. ఆ మాటకు వస్తే వారికి మించినట్లుగా వ్యవహరిస్తూ.. అధికార పక్షం చేసే వ్యాఖ్యల్ని తిప్పి కొట్టటం.. తనపై చేసే విమర్శలపై విరుచుకుపడుతున్నారు.

తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరైన ఆమె.. అధికార వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయంపై మాట్లాడిన ఆమె.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బదులు తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..

-  డబ్బులిచ్చి మనుషులను పెట్టి తిట్టించే స్థాయికి దిగజారిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటాం. అయితే చట్టం పరిధిలోనే వెళ్తాం. మాటకు మాట తప్పదు. కుక్కకాటుకు చెప్పుదెబ్బే కరెక్ట్.

-  ఒకవైపు కరోనా అల్లాడిస్తుంటే.. మరోవైపు నుంచి సీఎం జగన్ అల్లాడిస్తున్నారు. ఆయన అందరిని అల్లాడిస్తున్నారు. ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. నాలా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు రాటుదేలిపోవటానికి ఇదో మంచి అవకాశం. ఎప్పుడు ఏ పోలీసు వచ్చి ఎక్కడకు ఎత్తుకుపోతాడో తెలియటం లేదు. ఎక్కడ ఎవడొచ్చి  సీఐడీ నోటీసు అంటాడో తెలీదు.

-  మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలేది లేదు. మా నాయకుడికి చెప్పి ఒప్పిస్తాం.  ఇబ్బంది పెట్టటంలో వారు పీక్స్ కు వెళ్లిపోయారు. నాపైనే 11 కేసులు పెట్టారు. అందులో ఒకటి అట్రాసిటీ కేసు.

-  సీఎంను సైకో అంటాను. అది నిజం కాబట్టి నోటీసు ఇవ్వలేదేమో? నత్తి పకోడి.. నత్తి రెడ్డి అంటాను. ఆ మాట అనటానికి కారణం ఉంది. ఒకప్పుడు పప్పు నాయుడు అంటూ లోకేశ్ ఇమేజ్ ను ఎంత డ్యామేజ్ చేశారో తెలిసిందే. ఆ రోజు మాట్లాడని పెద్ద మనుషులు ఇప్పుడు నత్తి రెడ్డి అంటే ఉలిక్కిపడతారేం? నత్తి పకోడి అంటున్నందుకైనా జగన్ భాషలో మార్పు రావాలని.. తడబడకుండా మాట్లాడాలనుకుంటున్నా.

- విపక్ష నేతగా ఉన్నప్పుడు ఎప్పుడు తడబడలేదు. సీఎం అయ్యాక మార్పు వచ్చింది. అదే పెద్ద మిస్టరీ. ఆ రోజు సీఎం కావాలనే కసి ఉంది. ఈ రోజున అది లేదనిపిస్తోంది. ఇప్పుడు పబ్జీ మీద ఉన్న ఫోకస్ దేని మీదా లేదనిపిస్తోంది. బహిరంగ సభల్లో మాట్లాడితే అన్ని బండ బూతులే. ఆయన స్పష్టంగా మాట్లాడగలిగింది మాత్రం జుట్టు చూపించి మాట్లాడటమే.

-  ప్రభుత్వం వచ్చాక తొలి టార్గెట్ కొడాలి నాని. నిబంధనల ప్రకారమే పని పడతాం. సెకండ్ అంటూ ఏమీ లేదు. వాళ్లు చేసినంత కిరాతక రాజకీయాలు మేం చేయం. మళ్లీ మేమూ అదే చేస్తే ఉపయోగం ఏముంది? వాళ్లు చేసిన దానికి నిబంధనల ప్రకారమే చూసుకుంటాం.
Tags:    

Similar News