బీజేపీ నాయకులు, ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లోని సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే వివాదాస్పదం అవుతుంటే తాజాగా ఈ వరుసలోకి రాజస్థాన్ వచ్చి చేసింది. రాజస్థాన్ సివిల్ సర్వీస్ పరీక్షలకు(ఆర్ ఏఎస్) హాజరయ్యే అమ్మాయిలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆంక్షలు విధించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అమ్మాయిలు కచ్చితంగ సల్వార్ సూట్ గానీ చీరగాని ధరించి రావాలని లేదంటే పరీక్షలకు హాజరుకానివ్వబోమని స్పష్టం చేస్తూ ప్రకటన జారీ చేసింది.
పనిలో పనిగా అబ్బాయిలకు కూడా ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. హాఫ్ స్లీవ్స్ చొక్కాలు మాత్రమే ధరించాలని, చెప్పులు లేదా షాండిల్స్ ను సాక్స్ లేకుండా ధరించి పరీక్షలకు రావాలని ఆదేశించింది. నిండుగా చొక్కాలు ధరించినవారిని, షూలు ధరించినవారిని పరీక్షలకు హాజరుకానివ్వబోమని స్పష్టం చేసింది. విభిన్న వస్త్రాలంకరణతో వచ్చి పరీక్షల్లో మోసం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్లే తాజాగా ఈ నిబంధన విధించాము తప్ప మరో ఉద్దేశం లేదని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ ఇచ్చింది.