పెళ్లి ఫిక్స్.. బ్యాక్ లాగ్ లు క్లియర్ చేయలేక సూసైడ్

Update: 2021-03-24 09:30 GMT
అనుమానాస్పద రీతిలో ఒక ఇంజనీరింగ్ యువతి సూసైడ్ చేసుకున్న ఉదంతం హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. కలకలం రేపిన ఈ ఉదంతంలోకి వెళితే.. నల్గొండ జిల్లాలోని వెంకట్రాదిపాలెంకు చెందిన 22 ఏళ్ల చంద్రిక మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఆమెకు.. రంజిత్ అనే యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి నాలుగున ఎంగేజ్ మెంట్ అయ్యింది. కోర్సు పూర్తి చేసిన వెంటనే పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు.

ఇదిలా ఉండగా.. ఆమెకు 20 బ్యాక్ లాగ్ లు ఉన్నాయని.. వాటిని పెళ్లికి ముందే పూర్తి చేయాలని తల్లిదండ్రులు చెప్పటంతో ఒత్తిడికి గురైనట్లు చెబుతున్నారు. దీనికి తోడు.. పెళ్లికి ముందే బ్యాక్ లాగ్ లు పూర్తి చేస్తే బాగుంటుందని కాబోయే భర్త చేసిన సూచనతో ఆమె ఆందోళనకు గురైనట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఒత్తిడిని తట్టుకోలేక హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రివేళ ఫోన్ మాట్లాడటానికి బయటకు వెళ్లిన ఆమె.. తర్వాత రాలేదు.

స్నేహితుల ఇంటికి వెళ్లిందని రూమేట్స్ అనుకున్నారు. తీరా పొద్దున్నే ఆమె భవనం మీద నుంచి పడి చనిపోవటాన్ని గుర్తించారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. బ్యాక్ లాగ్ లు ఉంటే మాత్రం.. దాన్ని సాధించటం మానేసి.. సూసైడ్ చేసుకోవటం ఏమిటో?
Tags:    

Similar News