హామీలు ఇవ్వటం వేరు.. వాటిని వాస్తవంలోకి వచ్చేలా చేయటం వేరు. అధికారం అందరి చేతుల్లోకి వస్తుంది. చేతిలో పవర్ ఉన్నప్పుడు చేయగలిగిందంతా చేస్తే.. ఆ లెక్క వేరుగా ఉంటుంది. అధికారం కోసం అలుపెరగకుండా హామీలు ఇచ్చేసే నేతలు.. చేతికి పవర్ రాగానే వాటిని మర్చిపోయి.. మరేదో చేస్తుంటారు. అయితే.. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ మాత్రం అందుకు భిన్నం. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వరుస పెట్టి తన హామీల అమలు మీదనే ఆయన దృష్టి సారిస్తున్నారు.
ఎంత చిన్న హామీ అయినా.. పెద్ద హామీ అయినా వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావటమే తన లక్ష్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే పోలీసులకు వారాంతపు సెలవు ఇస్తానన్న హామీని అమల్లోకి తెచ్చేసింది జగన్ సర్కారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే పలు హామీల్ని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్న జగన్.. తాజాగా పోలీసులకు ఇచ్చిన వీక్లీఆఫ్ ను రియాలిటీలోకి తెచ్చేశారు.
వీక్లీ ఆఫ్ ఇష్యూను టేకప్ చేసిన డీజీపీ.. దీన్ని అమలు చేసేందుకు ఉన్న ఇబ్బందుల్ని వారం పాటు అధ్యయనం చేసి.. తొలుత ప్రయోగాత్మకంగా విశాఖ నగర పోలీసులకు వీక్లీ ఆఫ్ ను అమలు చేయనున్నారు. దీనికి తగ్గట్లే విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.
2147 మంది సివిల్.. 850 ఆర్మడ్ రిజర్వ్ పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అమల్లోకి తెచ్చిన వీక్లీఆఫ్ ను పరిశీలించి.. దశల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు. చెప్పటం కాదు చేతల్లోచేసి చూపిస్తోన్న జగన్ పాలన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వీక్లీఆఫ్ అమల్లోకి రావటం ఏపీ పోలీసులకు పండుగగా మారింది.