సంక్షేమపథకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరాఫ్‌గా మారిపోయింది. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను చేసి దేశంలోని రాష్ట్రాలన్నీ నివ్వెరపోతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం మరికొన్ని సంక్షేమపథకాలను తీసుకురాబోతున్నది. ఆ పథకాలు ఉగాది నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
వచ్చేనెల ఆరు సంక్షేమ పథకాలు అమలు కాబోతున్నాయి. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఎన్నికల మ్యానిఫెస్టో పొందుపరిచిన నవరత్నాలతోపాటు మరికొన్ని పథకాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ మేరకు ఏపీ సర్కారు సంక్షేమ క్యాలండర్ ను విడుదల చేసింది. ఏయే పథకాలు ఏప్పుడెప్పుడు అమలు కాబోతున్నాయో.. ఇందులో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్మోహన్రెడ్డి నిరంతరం.. అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఏప్రిల్ 6న వైఎస్సాఆర్ రైతు బీమాను అమలు చేయబోతున్నారు. అయితే ఈ బీమా పథకానికి అర్హత ఉండి .. దాని పరిధిలోకి రాకుండా మరణించిన వాళ్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోబోతున్నది. ఇందుకోసం ఈ నెల 6న నిధులను విడుదల చేయబోతున్నారు.
దాదాపు 12,039 కుటుంబాలకు లబ్ధి చేకూరబోతున్నట్టు అధికారులు ప్రారంభించారు.
గత ఏడాది అక్టోబరులో ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. నిబంధనల ప్రకారం బీమా పరిధిలోకి రాలేకపోయిన 11,022 మంది సాధారణ పరిస్థితులతో మృతిచెందినట్లు గుర్తించారు. మరో 1,017 మంది ప్రమాదవశాత్తు మరణించడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారని నిర్ధారించారు. వీళ్ల కోసం ప్రభుత్వం రూ. 258 కోట్లను అదనం విడుదల చేయబోతున్నది.
ఏప్రిల్ 9న తొలివిడత జగనన్న విద్యాదీవెన పథకం అమల్లోకి రానున్నది. 13న ఉగాదిని పురస్కరించుకుని వార్డు, గ్రామ వలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది. 16న రైతులకు సున్నా వడ్డీ పథకం, 20న మహిళా పొదుపు సంఘాలకు వడ్డీ స్కీమ్, 27వ తేదీన జగనన్న వసతి దీవెన కార్యక్రమం అమల్లోకి రానున్నది.