పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అయినా ఆమెలో ఆనందం కొరవడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఆమె తీసుకుంటున్న నిర్ణయాలన్నీ బూమరాంగ్ అవుతుండటం ఒక కారణమైతే పార్టీ నేతలు, అందులోనూ మంత్రులే అవినీతి కేసుల్లో చిక్కుకోవడం ఇంకో కారణమని చెబుతున్నారు.
తాజాగా మమత కేబినెట్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న పార్థా చటర్జీ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేతికి చిక్కారు. పార్థా చటర్జీ గతంలో మమత కేబినెట్ లో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయుల నియామకంలో చక్రం తిప్పారని ఆయనపై తీవ్ర అభియోగాలు ఉన్నాయి. తాజాగా మంత్రి పార్థా చటర్జీ అత్యంత సన్నిహితురాలు, సినీ నటి, మోడల్ అయిన అర్పితా ముఖర్జీ ఇంట్లో ఏకంగా ఒకే మొత్తంలో రూ.21 కోట్ల నగదు గుట్టలు గుట్టలుగా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇదంతా ఉపాధ్యాయుల నియామకంలో అక్రమంగా పోగేసిన సొమ్మేనని అంటున్నారు.
ఈ వ్యవహారంలో మంత్రి పార్థా చటర్జీతోపాటు అర్పితను, మరో ముగ్గురిని ఈడీ అరెస్టు చేసింది. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన మమత.. ఆయన నేరస్తుడయితే జైలుశిక్ష విధించినా తమకు అభ్యంతరం లేదని చెబుతుండటం గమనార్హం. అవినీతిని తృణమూల్ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదని ఆమె అంటున్నారు.
పార్థా చటర్జీ ఈ వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం వల్లే మమత ఇలా ఫ్లేటు ఫిరాయించారని చెబుతున్నారు. ఏ మాత్రం ఆధారాలు ఈడీకి లభించకపోయి ఉంటే ఇదంతా బీజేపీ కుట్ర అని మమత ఆరోపించేవారని బల్లగుద్ది స్పష్టం చేస్తున్నారు.
గతంలో శారదా చిట్ ఫట్ కుంభకోణంలో సాక్షాత్తూ మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ముఖ్య నేత అభిషేక్ బెనర్జీతోపాటు ఎంతోమంది మమత పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వచ్చాయి. మమత తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఈ కుంభకోణం బయటపడింది, ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ మమత పార్టీకి చెందిన నేతలందరినీ విచారించాయి. దీనిపై అప్పట్లో మమత మండిపడటం గమనార్హం. బీజేపీ కావాలని తమను లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు.
ఇప్పుడు మాత్రం పార్థా చటర్జీ కుంభకోణానికి సంబంధించి విస్పష్ట ఆధారాలు లభించడంతో మమత తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారని అంటున్నారు. అర్పిత ముఖర్జీ ఎవరో తనకు తెలియదని, ఒకసారి పార్థా చటర్జీనే దుర్గా పూజల కార్యక్రమంలో పరిచయం చేశారని.. ఆమె ఎలాంటిదో తనకెలా తెలుసని మమత గడుసుగా జవాబిస్తుండటం ఇందుకు నిదర్శనమి చెబుతున్నారు.