అది 2008 ఫిబ్రవరి 3.. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య తొలి మ్యాచ్. మంచి బ్యాటింగ్ టెక్నిక్, దూకుడైన ఆట ఉన్న 22 ఏళ్ల కుర్రాడు క్రీజులోకి వచ్చాడు. 15 బంతులాడి 2 పరుగులు చేశాడు. అంతలోనే 145 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిందో యార్కర్. అతడి బ్యాట్, కాళ్ల మధ్యలోంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. అంతే.. ఆ కుర్రాడి కళ్లు చెదిరాయి. ఆ బంతి వేసింది ఆస్ట్రేలియా స్పీడ్ గన్ బ్రెట్ లీ అయితే, ఆడింది మనోజ్ తివారీ. అతడు అంతకుముందు రంజీల్లో అదరగొట్టాడు. అయితే, ఈ మ్యాచ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు...
కట్ చేస్తే..2022 జూన్ 10.. 36 ఏళ్ల ఓ బ్యాట్స్ మన్ సెంచరీ కొట్టాడు. 136 నాటౌట్ (185 బంతుల్లో 19×4, 2×6) పరుగులతో సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో తమ జట్టు సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అతడు తొలి ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ (73) చేశాడు. 14 ఏళ్ల కిందట యార్కర్ కు బౌల్డయి కళ్లు తేలేసింది.. ప్రస్తుతం అర్ధ సెంచరీ, సెంచరీతో జట్టును రంజీ సెమీస్ చేర్చింది ఒక్కడే. చాలామంది క్రికెటర్ల కెరీర్ లో ఇదే జరుగుతుంది. ఇందులో విశేషం ఏముంది? అంటారా? ఇక్కడే ఉంది అసలు కథ. అతడు అప్పుడు సాధారణ క్రికెటర్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మంత్రి. అతడే మనోజ్ తివారీ. అటు మంత్రిగా ఫైల్స్ పై సంతకాలు పెడుతూ, ఇటు క్రికెటర్ గా జట్టుకు రంజీ ట్రోఫీ అందించాలనే పట్టుదలతో అతడు ప్రయత్నాలు సాగిస్తున్నాడు.
బ్యాడ్ లక్ బ్యాచ్ లో అతడు అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఊతప్ప.. తదితరుల తరహాలో అత్యంత ప్రతిభ ఉండి కూడా బ్యాడ్ లక్ కారణంగా అంతర్జాతీయ కెరీర్ లో ముందుకెళ్లలేకపోయాడు మనోజ్ తివారీ. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ లా దూకుడైన ఆటగాడిగా 2006-07 సీజన్ లో 796 పరుగులు (సగటు 99.50) చేసిన తివారీ.. ఏడాదిలోపే టీమిండియాకు ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్ పర్యటనలో అతడు మ్యాచ్ ఆడడమే మిగిలి ఉంది. కానీ, ప్రాక్టీస్ లో ఫీల్డింగ్ సందర్భంగా తీవ్రమైన భుజం గాయానికి గురయ్యాడు. 2008లో ఆస్ట్రేలియాపై అరంగేంట్రం చేసినా బ్రెట్ లీ యార్కర్ కు బలైపోయాడు. దీంతో మూడేళ్ల తర్వాత కానీ అతడు మళ్లీ టీమిండియాకు ఆడలేకపోయాడు. కానీ, ఓపెనింగ్ లో ఆకట్టుకోలేకపోయాడు.
బెంగాల్ క్రికెట్ లో చోటా దాదా భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. బెంగాల్ ప్రజలకు దాదా అయితే, మనోజ్ తివారీ చిన్న దాదా. అతడిని చోటా దాదాగా పిలుస్తుంటారు అక్కడివారు. గంగూలీ ఎలాగైతే 1990లో అరంగేట్రం చేసి.. ఆరేళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడో.. తివారీ కూడా దాదాపు నాలుగేళ్ల పాటు టీమిండియాకు ఆడలేకపోయాడు. రోహిత్ శర్మ గాయపడడంతో 2011 ఇంగ్లండ్ పర్యటనకు తివారీని తీసుకున్నారు. అయితే, ఆ స్థానం కూడా నిలవలేదు. 2012లో వెస్టిండీస్ పై చెన్నైలో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టినా.. తీవ్ర పోటీ కారణంగా తదుపరి మ్యాచ్ ల్లో మనోజ్ తివారీ అనూహ్యంగా బెంచ్ కే పరిమితం అయ్యాడు.
2012 శ్రీలంక టూర్, టి20 ప్రపంచ కప్ నకు ఎంపికయ్యాడు. కానీ, గాయాలతో దూరమయ్యాడు. 8 నెలల విరామం తర్వాత దేశవాళీల్లో పునరాగమనం చేశాడు. చిత్రంగా 2014 లో తిరిగి టీమిండియా పిలుపు దక్కింది. అది కూడా తొలిసారి ఎప్పుడైతే ఎంపికై గాయంతో దూరమయ్యాడో అదే బంగ్లాదేశ్ తో సిరీస్ కు. కానీ, అక్కడినుంచి అంతర్జాతీయ కెరీర్ ముందుకుసాగలేదు. 2020 పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీలో చేరిన అతడు.. గతేడాది ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుతం క్రీడల మంత్రిగా ఉన్నాడు.
బెంగాల్ కు రంజీ కప్ అందించాలని..పశ్చిమ బెంగాల్ కు రంజీ ట్రోఫీ అందించడమే లక్ష్యంగా ప్రస్తుతం మనోజ్ తివారీ బరిలో దిగాడు. అతడి ప్రతిభతో జార్ఖండ్‌తో క్వార్టర్‌ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ ఆధారంగా గెలిచిన బెంగాల్ ముందంజ వేసింది. ఓవర్‌నైట్ స్కోరు 76/3తో శుక్రవారం, ఆట ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్‌ను తివారి నడిపించాడు. అతడికి తోడు షాబాజ్ అహ్మద్ (46), అభిషేక్ పొరెల్ (34), అనుతప్ మజుందార్ (38) తలో చేయి వేయడంతో 318/7 స్కోరు వద్ద బెంగాల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా బెంగాల్ సెమీస్ చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 773/7 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. జార్ఖండ్ 298 పరుగులకే ఆలౌటైంది. చూద్దాం..మరి మనోజ్ తివారీ ప్రయత్నం ఏమేరకు విజయవంతం అవుతుందో?