కేంద్రం అప్పుల మాటేమిటి ?

Update: 2022-07-20 11:30 GMT
ఆర్ధిక పరిస్దితులు అస్తవ్యస్ధంగా మారి క్రమశిక్షణ లోపించిన పది రాష్ట్రాల్లోని పరిస్ధితులపై కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. పొరుగునున్న శ్రీలంకలో పరిస్దితులు దిగజారినట్లే మన రాష్ట్రాల పరిస్ధితులు దిగజారే అవకాశం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. అయితే శ్రీలంకను చూసి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని మాత్రం నొక్కిచెప్పింది. ఆర్ధిక క్రమశిక్షణ లోపించిన టాప్ టాన్ పదిరాష్ట్రాలను కేంద్రం ప్రస్తావించింది.

ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, ఝార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్ధాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఆర్ధికపరిస్ధితులను అఖిలపక్ష సమావేశంలో వివరించి కేంద్రం హెచ్చరించింది. ఓకే ఇంతవరకు బాగానే ఉంది తన బాధ్యతగా రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించాల్సిందే. అయితే రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులు ఎప్పటినుండి దిగజారిపోయాయి ? అందుకు కారణాలను కూడా వివరించాలి. ఇదే సమయంలో రాష్ట్రాలకు బుద్ధులుచెబుతున్న కేంద్రం ఆర్ధిక క్రమశిక్షణను కూడా చెప్పుకునుండాలి.

నిజానికి శ్రీలకంలోని పరిస్ధితులు మనదేశంలో తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే అని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మరచిపోయినట్లున్నారు. అసలు ఈ సమావేశాన్ని ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కాకుండా జై శంకర్ ఎందుకు నిర్వహించారో అర్ధం కావటంలేదు.

అప్పులు చేయటంలో కేంద్రానికి కూడా క్రమశిక్షణలేదు. ఎందుకంటే నరేంద్రమోడీ ప్రభుత్వం తాజా అప్పులు సుమారు 140 లక్షల కోట్ల రూపాయలు. రాష్ట్రాలను కంట్రోల్ చేయటానికి కేంద్రం ఉంది. మరి కేంద్రం చేస్తున్న అప్పులను, లోపిస్తున్న క్రమశిక్షణను గాడిలో పెట్టడానికి ఎవరున్నారు ?

ఏపీని జాతీయస్ధాయిలో ఇబ్బందిపెట్టాలని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రయత్నించారు. కనకమేడల వేసిన ప్రశ్నకు సమాధానంగానే కేంద్రం ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.

అయితే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబానాయుడు హయాంలో లెక్కల్లో లేని రు. 1.10 లక్షల కోట్ల వ్యవహారం కూడా బయటపడింది. రు. 1.62 లక్షల కోట్లకు లెక్కలు లేవని అప్పట్లో కాగ్ పదే పదే మొత్తుకుంటే చివరకు రు. 52 వేల కోట్లకు మాత్రం లెక్కలు చూపించినట్లు కేంద్రం ప్రకటించింది.  మరి మిగిలిన రు. 1.10 లక్షల కోట్లు ఏమైనట్లు ?
Tags:    

Similar News