మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ, పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీంకోర్టు ఏడాది జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఓ వృద్ధుడిని సిద్ధూ చితకబాదాడని.. ఆ దెబ్బలకు తాళలేక వృద్ధుడు మరణించాడనేది అభియోగం.
అసలు ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని పాటియాలాలో 1988 డిసెంబర్ 27న ఓ పార్కింగ్ విషయంలో సిద్దూ, అతడి స్నేహితుడు కలసి గుర్నామ్ సింగ్ సంధూ అనే వృద్ధుడితో గొడవ పడ్డారు. అంతటితో ఆగకుండా ఆయనను కారులో నుంచి బయటకు లాగి సిద్ధూ ఆయన తలపై పదే పదే చేతులతో కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక గుర్నామ్ సింగ్ మరణించాడు. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యులు పాటియాలా సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే సిద్ధు, అతడి స్నేహితుడు రూపీందర్ సింగ్ వృద్ధుడిని చంపారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సెషన్స్ కోర్టు 1999లో కేసు కొట్టేసింది.
దీనిపై బాధితులు పంజాబ్–హరియాణా ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు 2006లో సిద్ధూకి మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. దీంతో సిద్ధూ లొంగిపోయి 2007లో జైలు కెళ్లారు. హైకోర్టు తీర్పుపై సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో సిద్ధూకి ఊరట లభించింది. సిద్ధూ కొట్టడం వల్ల వృద్ధుడు మరణించలేదని.. అయితే వృద్దుడిని గాయపరిచినందుకు కేవలం 1000 జరిమానా విధించి 2018లో సుప్రీంకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యులు మళ్లీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ ఏడాది మే 19న సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని మార్చుకుంది.
గుర్నామ్ సింగ్‌పై సిద్ధు దాడి చేసేటప్పుడు సిద్ధూకి 25 ఏళ్లు మాత్రమేనని, అలాగే గుర్నామ్ సింగ్‌కి 66 ఏళ్లు ఉన్నాయని కోర్టు నిర్ధారించింది. వ్యక్తి విచక్షణ మరిచిపోయినప్పుడు అతడి చెయ్యే ఆయుధంలా మారుతుందని వ్యాఖ్యానించింది. సిద్ధూ వృద్ధుడిని కొట్టడం వల్లే ఆయన మరణించాడని నిర్ధారించింది. ఇందుకు సిద్ధూకి ఏడాది జైలుశిక్ష విధించింది. గతంలో తీర్పు ఇచ్చినప్పుడు తాము కేసు తీవ్రతను సరిగా అర్థం చేసుకోలేదని సుప్రీంకోర్టు పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా సరైన తీర్పు ఇవ్వకపోతే కోర్టులపై, చట్టాలపై సామాన్య ప్రజలకు విశ్వాసం పోతుందని వెల్లడించింది.
దీంతో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తానని ట్వీట్ చేశాడు. అయితే తనకు ప్రస్తుతం ఆరోగ్యం బాగోనందువల్ల వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోలేనని.. ఇందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేశాడు. అయితే దీన్ని విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సిద్ధూ పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో వెంటనే పోలీసుల ఎదుట సిద్ధూ లొంగిపోవాల్సి ఉంటుంది. తర్వాత ఆయనను జైలుకు పంపుతారు.
అయితే డాషింగ్ ఓపెనర్‌గా, సిక్సర్ల సిద్ధూగా పేరు పొందిన సిద్ధూకి వివాదాలు కొత్త కాదు. గతంలోనూ అనేక వివాదాల్లో ఇరుక్కున్నాడు. పాకిస్థాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై సిద్ధూ పలుమార్లు పొగడ్తలు కురిపించాడు. పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడాడు. ఇక 1986లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లి అక్కడ కెప్టెన్ అజారుద్దీన్‌తో గొడవ పడి మధ్యలోనే ఇండియాకి తిరిగొచ్చేశాడు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అలాగే ఒక టీవీ చానెల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు ప్రముఖ క్రికెట్ చానల్ ఈఎస్‌పీఎన్ సిద్ధూపై కేసు వేసింది. తమతో ఒప్పందం చేసుకుని ఉల్లంఘించారని సిద్ధూపై ఆరోపణలు చేసింది.