అమెరికాలో రోడ్డు ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తెలుగు వాళ్లు చనిపోగా తాజాగా మరో విషాదం అలుముకుంది. అమెరికాలో ఈనెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి క్రాంతికిరణ్ రెడ్డి (24) మృతి చెందడంతో అతడి స్వగ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
సారెడ్డి శ్రీనివాసరెడ్డి-అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. సారెడ్డి చంద్రకాంత్ రెడ్డి, సారెడ్డి క్రాంతి కిరణ్ రెడ్డి దంపతులు ఇద్దరూ వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు క్రాంతికిరణ్ రెడ్డి హైదరాబాద్ లోని సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. అదే సమయంలో టీసీఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో కొంత కాలం పనిచేసి ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్లారు.
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు 2021 జూలై 23వ తేదీన సారెడ్డి క్రాంతికిరణ్ రెడ్డి వెళ్లాడు. ఆ తర్వాత తన అన్న సారెడ్డి చంద్రకాంత్ రెడ్డి 2021 నవంబర్ లో వెళ్లారు. అన్నాదమ్ములు ఇద్దరూ ఒకే దగ్గర ఉంటూ ఎంఎస్ చదువుతున్నారు.
ఈనెల 7వ తేదీన తన స్నేహితులతో కలిసి క్రాంతికిరణ్ రెడ్డి బయటకు వెళ్లగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే తట్టుకోలేరని భయపడిన అన్న చంద్రకాంత్ రెడ్డి మంగళవారం ఈ సమాచారం అందించాడు.
విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.తల్లి అరుణ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఇక అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన క్రాంతికిరణ్ రెడ్డి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని ఆయన తల్లిదండ్రులు కోరారు. సీఎం కేసీఆర్ చొరవ చూపాలన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు స్పందించి ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మృతదేహాన్ని తెప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.