అరుకు వ్యాలీ అంటే అందరికి ఎంతో ఇష్టం. వింటర్ సీజన్ లో అరుకు అందాలు చూడాలాని అంతా ఉవ్విళ్లూరుతారు. అందుకే ఇటీవల పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. అరుకు లోయ నుంచి కిందకు వస్తున్నప్పుడు మలుపులు తిరిగి ఉన్న ఆ రోడ్డు చూస్తేనే భయం వేస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలతో చెలగాటమాడినట్టే, అయితే ఇప్పటి వరకు చిన్న చిన్న ప్రమాదాలు తప్ప ఈ తరహా ప్రమాదం ఎప్పుడు జరగలేదు. దీంతో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.. శుక్రవారం రాత్రి ప్రమాదం తరువాత అధికారులు నిద్ర నుంచి లేవాల్సిన అవసరం ఉంది.
లేకపోతే , ఇది మృత్యులోయగా మారి ఎందరో ప్రాణాలను హరించే అవకాశం ఉంది. అరకులోయ ఘాట్ రోడ్ లో మొత్తం 8 ప్రమాదకర హెయిర్ పిన్ బెండ్ లు ఉంటాయి. ఈ ప్రమాదకర మలుపుల దగ్గర వాహనాలు వెళ్లడం అంత సులువు కాదు. భారీ వాహనాలు ఈ మలుపుల్లో వంకర్లు తిరిగేందుకు అవస్థలు పడాలి..ఏ మాత్రం అనుభవం లేకున్నా ప్రాణాలతో చెలగాటమాడాల్సిన పరిస్థితి వస్తుంది. వంకర్లు తిరిగిన ఘాట్ రోడ్డుపై ప్రయాణమంటే ఎన్నిజాగ్రత్తలు తీసుకోవాలి? కానీ ప్రమాదానికి గురైన టూరిస్ట్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ట్రావెల్స్ యజమానులతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదానికి కారణమైంది. దినేష్ ట్రావెల్స్ కు చెందిన ఈ మిని బస్సు అస్సలు కండిషన్ లో లేనట్టు అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన షేక్ పేట వారిగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, 108 సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిని వారిని ఎస్.కోటలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడిపిన కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన వారిలో ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఉన్న వారందరికీ గాయాలయ్యాయి. గాయాలతో చిన్నారులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
బ్రేక్ లు ఫెయిల్ అవ్వడమే ప్రమాదానికి కారణమంటున్నారు క్షతగాత్రులు కొందరు. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలవ్వడంతో వాహానాన్ని గేర్లో ఉంచి డ్రైవర్ వేగం తగ్గించాడని, కానీ దిగువ ప్రాంతం కావడంతో పట్టు తప్పిప బస్సులోయలో పడిందని ప్రమదాన్ని గుర్తు చేసుకుని భయపడుతున్నారు. అసలు రాత్రికి అక్కడ బస చేసి, తెల్లవారుజామున బయలుదేరుదామని చెప్పినా డ్రైవర్ వినలేదని, తనకు ఈ ప్రాంతం కొత్త త్వరగా వెళ్లిపోదామని కంగారు పడడంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు కొందరు. విషయం తెలిసిన వెంటనే మంత్రి అవంతి శ్రీనివాసరావు కలెక్టర్ వినయ్‌చంద్, ఎస్పీ కృష్ణారావులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే బస్సు డ్రైవర్ శ్రీశైలం వాదన మరోలా ఉంది. బస్సు ప్రమాద సమయంలో 20 కిలోమీటర్ల వేగంలో ఉందన్నారు. బస్సు అదుపు తప్పిందని గమనించి వెంటనే అప్రమత్తం చేశానని.. ఒక్కసారిగా అరుపులు, కేకలతో భయాందోళలు కలిగాయన్నారు. అక్కడ చెట్టు అడ్డులేకపోతే అందరం చనిపోయేవాళ్లమన్నారు. ఘాట్‌రోడ్డులో ప్రయాణానికి ఒత్తిడి తెచ్చానన్నది సరికాదని.. త్వరగా విశాఖ చేరుకోవాలని పర్యాటకులే కోరారన్నారు. విశాఖపట్నం జిల్లా అరకులో శుక్రవారం బస్సు ప్రమాదం జరిగింది. అరకు ఘాట్ రోడ్డు, అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది.. డముకు 5వ నంబర్ మలుపు వద్ద లోయలోకి దూసుకెళ్లింది.