బ్లాక్‌ఫంగస్ ఇటీవల ఈ పేరు వింటేనే చాలా మందికి వెన్నులో వణుకుపుడుతోంది. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. ఆస్పత్రులు అన్నీ కోవిడ్ బాధితులతో నిండిపోయాయి. ఆక్సిజన్ కొరత ఏర్పడింది. బెడ్స్ దొరకడం లేదు. ఇక ఏదైనా ఆస్పత్రులో బెడ్ కావాలంటే ఎంపీ, మంత్రి స్థాయి వ్యక్తితో సిఫారసు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో బ్లాక్‌ఫంగస్ అనే మరో భయంకర వ్యాధి తెరమీదకు వచ్చింది. ముఖ్యంగా కోవిడ్ తో బాధపడుతూ.. స్టీరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్నవారికి, మధుమేహ (షుగర్) వ్యాధిగ్రస్థులకు, కిడ్నీ మార్పిడి లాంటి శస్త్ర చికిత్స చేయించుకున్నవాళ్లకు ఈ వ్యాధి బయటపడుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.
మొదట్లో ఈ వ్యాధి ఆనవాళ్లు ఎక్కువగా ఉత్తరాదిలో కనిపించాయి. ఢిల్లీ, ముంబైలో కొంతమందికి ఈ వ్యాధి సోకింది. ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణలోనూ బ్లాక్‌ఫంగస్ బాధితులు బయటపడ్డారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ముగ్గురు, నలుగురు ఈ బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్నట్టు సమాచారం. అయితే బ్లాక్ ఫంగస్ ఎవరికి వస్తుంది? ఏ పరిస్థితుల్లో వస్తుంది? తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం..
బ్లాక్ ఫంగస్ పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ కీలక సూచనలు చేశారు.
కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించినట్టు ఆయన చెప్పారు. కరోనా బాధపడుతూ స్టిరాయిడ్స్ తీసుకున్న వారిలో ఈ వ్యాధి కనిపించదని చెప్పారు. ప్రారంభంలో గుర్తిస్తే బ్లాక్‌ఫంగస్ ను నయం చేయవచ్చని ఆయన తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు మాత్రమే ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని చెప్పారు.
షుగర్ తో బాధపడేవాళ్లకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.
బ్లాక్‌ఫంగస్ లక్షణాలు..
కళ్లు ఎర్రబారటం, ముక్కు చుట్టూ నొప్పి, అధిక జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండకపోవడం కూడా వ్యాధి లక్షణాలు. కరోనా ట్రీట్మెంట్ తీసుకున్నవాళ్లందరికీ ఈ వ్యాధి సోకే అవకాశం లేదు. కేవలం కొంతమందికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది.