ఒక్క తాటిపైకి కొడాలి నాని, వంగవీటి రాధ ..

Update: 2021-09-28 10:30 GMT
కొందరు రాజకీయ నేతలకు పార్టీలతో సంబంధం ఉండదు. వ్యక్తిగతంగానే వారికి ఫాలోయింగ్ ఉంటుంది. వారు ఏ పార్టీలో ఉన్నా వారి అనుచరులు, శ్రేయోభిలాషులు వారి వెంటే ఉంటారు. అలా కృష్ణా జిల్లాలో తమదైన శైలిలో ప్రత్యేకతను చాటుకున్న వంగవీటి కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. వంగవీటి రంగా కు ఉన్న అభిమానం మాములుది కాదు. అయన తరువాత తన కుమారుడు వంగవీటి రాధ అంతే స్థాయిలో అభిమానాన్ని చూరగొన్నాడు. ఇక గుడివాడలో చక్ర తిప్పే రాజకీయాల్లో దిట్ట గా పేరున్న కొడాలి నానిది ప్రత్యేకమే. పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే వంగవీటి రాధ, కొడాలి నానిలు ఒకే జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు. వీరు మంచి స్నేహితులు కూడా. కొంత కాలంగా వీరు దూరంగా ఉంటున్నారు. కానీ ఇటీవల ఓ ఫంక్షన్లో కలుసుకొన్నారు.

వైసీపీ నేత పాలేటి సుబ్రహ్మణ్యం మనువడి బర్తడే పార్టీకి వంగవీటి రాధ, కొడాలి నానిలను ఆహ్వానించారు. కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అంతకుముందు ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరు బర్త్ డే ఫంక్షన్లో కలుసుకొని ఒకరినొకు మాట్లాడుకున్నారు. బాగోద్వేగానికి గురయ్యారు. అప్పటి వరకు ఇద్దరు నేతల అనుచరులు కారం, నిప్పులా రగులుతున్న వారు ఒక్కసారిగా కలిసిపోయారు. అంటే వీరు మళ్లీ మంచి స్నేహితులుగా మారారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. మరోసారి వీళ్లు ఒకే పార్టీలో కొనసాగుతారా..? అంటే నిజమేనన్న చర్చ సాగుతోంది.

కొడాలి నాని సుధీర్ఘ కాలంగా టీడీపీలో కొనసాగి ఆ తరువాత వైసీపీలో చేరారు. చంద్రబాబు మీదున్న కొపంతోనే ఆయన టీడీపీని వీడినట్లు పలు సార్లు వెల్లడించారు. ఆయన వైసీపీలోకి మారిన తరువాత ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం కేబినెట్లో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. జగన్ కు అత్యంత సన్నిహిత మంత్రిగా కొడాలి నాని పేరు తెచ్చుకున్నాడు. ప్రతిపక్షాలను తన వాక్చాతుర్యంతో కప్పి పెట్టే నాయకుడిగా పేరుంది. దీంతో పార్టీలో కొడాలి నానికి ప్రధాన్యం పెరిగింది. సీఎం జగన్ కూడా కొడాలి నానికి అడ్డు చెప్పకుండా ఉంటున్నాననడంతో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

అటు వంగవీటి రాధా మొదటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ఉన్నారు. ఆయన హయాంలో 2009లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి పార్టీ ఏర్పాటు చేయడంతో అందులో చేరారు. ఆ తరువాత ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. జగన్ సొంతంగా పార్టీ పెట్టిన తరువాత రాధ వైసీపీలో చేరారు. అయితే 2014లో తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలోనూ కొనసాగినా టీడీపీలోకి మారుతారని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో ఆయన జనసేనలోకి వెళ్తారని అనుకున్నారు. కానీ ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నారు.

అయితే వంగవీటి రాధా గుడివాడ కేంద్రంగా రాజకీయం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. గుడివాడ నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గం కొడాలి నానికి వ్యతికంగా ఉంటున్నారు. దీంతో ఆ సమాజిక వర్గ నేతలతో వంగవీటి రాధ తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారికి దగ్గరయ్యేందుకు ప్రత్యేకంగా కలుస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే కొడాలి నాని మాత్రం తనకు పోటీగా ఉండకుండా రాధకు బంఫర్ ఆప్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాధకు ఎమ్మెల్సీగా చేస్తే కాపు సామాజిక వర్గాన్ని తనవైపుకు తిప్పుకోవచ్చని కొడాలి నాని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Tags:    

Similar News