టీ20 ప్రపంచకప్ లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్ లో పాకిస్తాన్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. లీగ్ స్టేజిలో వరుసగా విజయాలు నమోదు చేసిన బాబర్ ఆజామ్ సేన.. ఆసీస్ చేతుల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి తప్పుకుంది.
ఇక ఈ మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ లో బాబర్ ఆజామ్ ఏం చెప్పాడో వింటే మీరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ‘బాహుబలి’ సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో తన సైన్యాన్ని చావు భయం నుంచి తప్పించేందుకు ‘బాహుబలి’ ప్రభాస్ గొప్పగా స్పూర్తి నింపుతాడు. సరిగ్గా పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ కూడా ఇదే పని చేశాడు.
తన ప్లేయర్స్ లో స్పూర్తిని నింపాడు. ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి అనంతరం పాక్ జట్టు మొత్తం నిరాశతో ఉండిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ అంతా సైలెంట్ గా ఉంది. ఈ తరుణంలో కెప్టెన్ బాబర్ ఆజామ్. తన ప్లేయర్స్ ను ఉత్సాహపరుస్తూ అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. సుమారు రెండున్నర నిమిషాల పాటు సాగిన అతడి స్పీచ్ చాలా బాగుంది. అక్కడ బాహుబలి తన సైన్యానికి మరణం అర్ధాన్ని వివరిస్తే ఇక్కడ బాబర్ తన సైన్యానికి ఓటమి అర్ధాన్ని చెప్పుకొచ్చాడు.
జరగాల్సింది జరిగిపోయింది. ఈ ఓటమి గురించి ఎవరూ మాట్లాడొద్దు. అలాగే ఈ ఓటమికి ఎవరినీ నిందించవద్దు. మేము చాలా కష్టపడి ఓ అద్భుత టీంను నిర్మించగలిగాం. దానిని కొనసాగించాలి. ఈ ఓటమిని త్వరగా మర్చిపోయి.. జట్టుగా ముందుకు కదలాలి. తప్పు ఎక్కడ చేశామో దానిపై దృష్టి సారించాలి.
ఈ ఓటమి గురించి ఎవ్వరూ చర్చించుకోవద్దు. ఈ ఓటమి గురించి ఎవరైనా మాట్లాడుకున్నట్లు వింటే.. వారితో నా తీరు భిన్నంగా ఉంటుందని బాబర్ ఆజామ్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Full View Full View Full View Full View Full View Full View Full View