ఉండ‌వ‌ల్లి ఏమ‌న్నారు... స‌జ్జ‌ల ఏం చెప్పారు...? క్లారిటీ ఇదీ...!

Update: 2022-12-09 13:30 GMT
రాష్ట్రంలోనే కాదు.. పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లోనూ..ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఆయ‌న‌ పైతీవ్ర విమ‌ర్శ‌లే చేస్తున్నారు. ఇప్ప‌టికే  తెలంగాణ కాంగ్రెస్, వైఎస్సార్  తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల తీవ్ర‌స్థాయి లో విరుచుకుప‌డ్డారు. రెండు రాష్ట్రాలూ క‌లిసి ఉండాల‌నేదే వైసీపీ ఆలోచ‌న‌గా ఉంద‌ని, దీనికి సంబంధిం చి ఏం చేయాలో అది చేస్తామ‌ని స‌జ్జ‌ల అన్నారు.

అయితే అస‌లు దీని వెనుక ఏం జ‌రిగింది?  దానిని వైసీపీ త‌న‌కు అనుకూలంగా ఎలా మార్చుకుంది? అనేది స్ప‌ష్టత చాలా మందిలో కొర‌వ‌డింది. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. రాజ‌కీయ విశ్లేష‌కులు, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌.. సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన తీరు అశాస్త్రీయ‌ని, పార్ల‌మెంటు త‌లుపులు మూసి విభ‌జ‌న చేశార‌ని, ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని.. "అన్యాయాన్ని" స‌రిదిద్ది.. ఏపీకి న్యాయం చేయాల‌ని ఆయ‌న పిటిష‌న్‌లో అభ్య‌ర్థించారు.

అంత‌కుమించి ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌ను క‌లిపి ఉంచాల‌ని కానీ.. తెలంగాణ ఏర్పాటును ర‌ద్దుచేయాల‌ని కానీ ఆ పిటిష‌న్‌లో కోర‌లేదు. దీనిపై ఇటీవ‌ల విచార‌ణ జ‌రిగింది. మ‌రోసారి ఫిబ్ర‌వ‌రి 2023లో  సుప్రీంలో విచార‌ణ‌కు రానుంది.  ఈ నేప‌థ్యంలో ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా వాదించి విభ‌జ‌న హామీల్లో ఇచ్చిన‌వి త‌మ‌కు అంద‌లేద‌ని.. కేంద్రం తాత్సారం చేస్తోంద‌ని. జ‌నాభా ప్రాతిప‌దిక‌న రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని కోరాల‌ని మాత్ర‌మే సూచించారు.

కానీ, దీనిపైవైసీపీ ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌న్న‌ది ఉండ‌వ‌ల్లి ఆవేద‌న, ఆందోళ‌న‌. ఈ విష‌యాన్నే ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పుకొచ్చారు. ఇక‌, దీనిపై స్పందించాల్సిన వైసీపీ స‌ల‌హాదారు..అస‌లు విష‌యాన్ని ప‌క్క‌న పెట్టిరెండు రాష్ట్రాలూ స‌మైక్యంగా ఉంచాల‌నేది త‌మ విధాన‌మ‌న్నారు. జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని ఉండ‌వ‌ల్లి అంటుంటే.. అస‌లు న‌ష్ట‌మే రాకుండా చూడాల‌ని కోరుతున్నామ‌ని వైసీపీ చెబుతోంది. ఇదిసాధ్య‌మ‌య్యే ప‌నికాద‌ని తెలిసినా.. ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి, రాజ‌కీయంగా మైలేజీ కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌డ‌మే ఇప్పుడు వివాదానికి దారితీసింది. దీనిపై భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News