ఎగిరే పళ్లెం ఆ జర్నలిస్టుకు చెప్పింది ఏంటి?

Update: 2022-02-16 01:30 GMT
అమెరికాలోని వర్జీనియాలో ఉండే వైథెవిల్‌ అనే ప్రాంతం చాలా మిస్టరీలకు నెలవుగా ఉండేది. ఇందుకు ప్రధాన కారణం 1987లో గ్రహాంతరవాసులు భూమి మీదకు వస్తున్నారు అనే సంకేతాలు. వారు వారి కళ్లారా ఎగిరే వింతైన పళ్లెం వంటి ఆకారంలో ఉంటే వాటిని కొన్నింటిని చూశారు. దీనితోనే ఆ ప్రాంత వాసులు  చాలా మంది కొన్ని ఏళ్ల పాటు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతికారు.

 చీకటి పడింది అంటే చాలు గజగజా వణుకుతూ తలుపులకు తాళాలు వేసుకునే వారు. ఇది కొన్ని ఏళ్ల పాటు ఆ ప్రాంత వాసులను కుదురుగా ఉండనివ్వలేదు.

ఇదంతా ఎలా ఉన్న కానీ.. ఈ వింతను చూసిన ఓ జర్నలిస్ట్ మాత్రం అందరిలా కుదురుగా ఉండలేకపోయాడు. తాను చూసింది ఈ ప్రపంచానికి చెప్పాలని అనుకున్నాడు.  ఇందుకోసం ఏకంగా అధికారులతో పాటు... తనతో తానే ఓ పెద్ద యుద్ధం చేశాడు.

అసలు ఏం జరిగింది అంటే అమెరికాలో ఉండే వేర్ రేడియో కి డ్యానీ అనే వ్యక్తి పనిచేస్తుండేవాడు. ఆయన ఉద్యోగంలో భాగంగానే తనకు తెలిసిన విషయాలను ఆ రేడియో వినే వారితో పంచుకునే వాడు. అలానే ఆయనకు తెలిసిన ఓ అంశాన్ని చెప్పాడు.

అదే ఎగిరే  పళ్లెం  ముచ్చట. వర్జీనియాలో ఉండే వైథెవిల్‌  ప్రాంతంలో గాలిలో కొన్ని పళ్లంలాంటి వస్తువులు కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఈ విషయాన్ని మనకు ఎఫ్ఎంలో చెప్పినట్లుగా చాలా జోక్ గా చెప్పారు. కానీ దాని తీవ్రత చాలా ఉందని అప్పటికి డ్యానికి తెలియదు. ఆ వీడియో వింటున్న శ్రోతలు కూడా ఈ విషయంపై చాలా స్పందించారు.

ముఖ్యంగా వాటిని చూసిన కొందరు ప్రజలు. ఏకంగా డ్యానికి ఫోన్ చేసి విషయాన్ని పూస గుచ్చినట్లు చెప్పారు. దీనిని బట్టి డ్యానికి విషయం తీవ్రత ఎంత అనేది అర్థం అయ్యింది. దీంతో తానే స్వయంగా తెలుసుకోవాలి అనుకున్నాడు. వాటిని చూసేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు.

 తాను వేటి కోసం అయితే ఎదురు చూస్తున్నాడో అవి రానే వచ్చాయి.  పళ్లెం  వంటి ఆకారంలో ఓ పెద్ద వస్తువు వెలుగులు విరాజిల్లుతూ వచ్చింది. తన కళ్లతో చూసి నమ్మలేకపోయాడు. ఫోటోలు తీయడానికి ట్రై చేశాడు. కానీ కెమెరా మరిచిపోయి వచ్చాడు.

తరువాత రోజు కూడా డ్యానీ తన ఫ్రెండ్ తో కలిసి అక్కడికి వెళ్లాడు.  అయితే ఈ సారి ఫోటోలు  కూడా తీశాడు. ఈ ప్రపంచానికి వాటిని చూపించి పరిచయం చేయాలని భావించాడు. ఇందుకు ఓ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశాడు. కానీ అతనికి ఓ షాక్ తగిలింది. ఆ  ఎగిరే పళ్లెం ల గురించి చెప్తే బాగోదు అని ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు.

దానికి తోడు మరో ఫోన్... ప్రభుత్వం కూడా దీనిపై చాలా పరిశోధన చేస్తుందని. అయితే డ్యానీ మాత్రం మొదట వచ్చిన ఫోన్ తో వెనక్కి తగ్గాడు. అప్పటికే ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫిరెస్ లో ఎగిరే పళ్లాలపై తాను పూర్తి స్థాయిలో మాట్లాడేందుకు కొంత సమయం పడుతుందని అన్నాడు. అయితే తాను ప్రెస్ కాన్ఫిరెన్సు నుంచి ఇంటికి పోగానే తాళాలు పగలగొట్టి ఉండడం గమనించాడు.

వచ్చిన వారు మిగతా వస్తువులను వేటిని పాడు చేయలేదు. కానీ తాను ఈ ప్రపంచానికి చూపించాలనుకున్న ఫోటోలు మాత్రం మిస్ అయ్యాయి. అప్పటికే డ్యానికి అర్థం అయ్యింది. ఇది తనను బెదిరించిన వారి పని అని. ఇదిలా ఉంటే కొద్ది కాలంలోనే ఈ ఎగిరే పళ్లెం  లను చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది.

దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఆపద వస్తుందో అని రక్షణ శాఖ లోని ఉన్నతాధికారులను కలిశాడు. దీనిపై వారు సమాధానం విన్నాడు. వారు చెప్పింది ఏంటి అంటే.. ఈ ఎగిరే పళ్లెం  ల గురించి తమకు తెలుసని... కానీ వాటి నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ఆ మాటలు విని తను తిరుగు ప్రయాణమయ్యారు.

కొన్ని నెలలు దాటింది. కానీ డ్యానీని ఏదో అసంతృప్తి వెంటాడుతుంది. ఈ లోపు ఓ పెద్దాయన  నుంచి కాల్ వచ్చింది.  నేను చెప్పేది జాగ్రత్తగా విను... నువ్వు ఆ ఎగిరే పళ్లెం ల గురించి పరిశోధించడం, మాట్లాడటం లాంటివి చేయకు.  అలా చేస్తే నీకు ,  ఫ్యామిలీకి చాలా ప్రమాదం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.. నీలానే చేసిన నా కొడుకు కనిపించకుండా పోయాడని అన్నారు ఆ పెద్దాయన.

అయితే కొన్ని రోజులకు ఈ విషయంపై ఆలోచడం తగ్గించాడు కానీ.. పూర్తిగా వదిలేయలేదు. తనలాగే ఓ జర్నలిస్ట్ మిత్రుడు డ్యానికి పరిచయం అయ్యాడు. ఆయనకు కూడా ఈ పళ్లాలపై అమితమైన ఆసక్తి ఉండడం గమనించాడు. వీరిద్దరూ వాటి పై పరిశోధన చేయడం ప్రారంభించారు.

వాటిని చూసి వారికి సంబంధించిన వారిని కలిసి ఇంటర్వూలు తీసుకున్నారు. ఇలా వారు చేసిన దానిని ఏకంగా ఓ పుస్తకం రూపంలో విడుదల చేశారు. ఆ పుస్తకం పేరే 'డోంట్ లుక్ అప్'. అందరికి ఆసక్తి ఉన్న అంశం కాబట్టి ఆ పుస్తకం చాలా కాపీలు అమ్ముడుపోయింది.

కేవలం ఒక్క వైథెవిల్ లో జరిగిన వాటి గురించి మాత్రమే గాక... అనేక అనేక ఘటనలను ప్రస్తావించారు. అయితే ఆ ఎగిరే పళ్లెం ల  వెనక ఉన్న అసలు రహస్యం గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు.

కానీ ఆ మిస్టరీలను చరిత్ర చదువుకునే వారికి అనువుగా రూపొందించాడు. ఇప్పటికీ ఎవరైనా వాటి గురించి మాట్లాడితే... తాను ఆ పుస్తకం రాయకపోతే ఆ మిస్టరీలు అందరికీ తెలిసేవి కావని అంటున్నాడు. కానీ అసలు అవి నిజంగానే గ్రహాంతర వాసుల పనా? లేక ప్రభుత్వం ఏమైనా చేసిందా అంటే? కాలమే సమాధానం చెప్తుంది అంటారు.
Tags:    

Similar News