తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపకాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. విచారణ సందర్భంగా సుప్రీం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలుగు అకాడమీ విభజన అంశం న్యాయపరిధిలోకి రాదని.. దీనిపై తెలంగాణ హైకోర్టు ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తుందని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాల అధికారులు కలిసి కూర్చొని చర్చించి ఉద్యోగుల, ఆస్తుల పంపకాలపై నిర్ణయం తీసుకోవాలని తన నోటీసు ద్వారా తెలియజేసింది.
తెలుగు అకాడమీపై ఏకాభిప్రాయానికి రాకపోతే విచారణ చేపడుతామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. 2018 డిసెంబర్ నుంచి తమకు వేతనాలు అందడం లేదని ఉమ్మడి అకాడమీని విభజిస్తే తమకు న్యాయం జరుగుతుందని ఏపీ పరిధిలోని తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రాల్లో పనిచేస్తున్న రోజువారి, ఒప్పంద సిబ్బంది తెలంగాణ హైకోర్టులో గత నవంబర్ లో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై జనవరిలో ధర్మాసనం విచారణ చేపట్టింది. మూడు నెలల్లో అకాడమీ విభజన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
రెండు నెలల్లో విభజనకు మార్గదర్శకాలను రూపొందించుకోవాలని ఆ తర్వాత నెలరోజుల్లో కేటాయింపులు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు, పిటీషనర్లకు అసౌకర్యం కలిగించినందుకు 17మంది మూడు వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది.