లాక్ డౌన్ వేళ ఆ 5 నగరాల వారు దేని కోసం వెతికారు?

Update: 2021-06-22 11:30 GMT
చేతిలో ఉండే మొబైల్ ఫోన్.. దాన్లో అన్ లిమిటెడ్ డేటా. ఇంకేం.. ఏం కావాలన్నా.. మరేం అవసరమైనా గూగులమ్మను ఆశ్రయించటమే. విడి రోజుల సంగతి ఎలా ఉన్నా.. కరోనా కాలం అందునా లాక్ డౌన్ వేళ.. ఐదు మెట్రోనగరాలకు చెందిన నెటిజన్లు ఎక్కువగా వేటి కోసం వెతికారు? ఏ సమాచారాన్ని వారు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎలాంటి సేవల కోసం వారు శోధించారు అన్న విషయంపై ఒక సంస్థ తాజాగా అధ్యయనం చేసింది.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్..ముంబయి.. చెన్నై.. బెంగళూరు మహానగరాల్లోని నెటిజన్లు ఏయే అంశాల కోసం ఎక్కువగా గాలించారన్న విషయాన్ని సులేఖ సంస్థ అధ్యయనం చేసింది. దాదాపు రెండు లక్షల మంది వినియోగదారులపై తామీ అధ్యయనం చేసినట్లు చెప్పింది. ఎలాంటి వస్తు సేవల కోసమైనా సరే..అందుకు తగ్గ సమాచారాన్ని అందించే సులేఖ వెబ్ సైట్ సేకరించిన సమాచారాన్ని చూస్తే.. ఐదు మహానగరాలకు చెందిన వారు వేర్వేరు అంశాల గురించి వెతికినట్లుగా కనిపిస్తుంది.

అయితే..ఈ ఐదు మహా నగరాలకు చెందిన వారు కామన్ గా వెతికిన అంశాల్లో మొదటి స్థానం బ్యూటీ సెలూన్స్ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. తర్వాతి స్థానం బ్యూటీ ప్లార్లర్ కు ప్రాధాన్యత ఇచ్చారు. ఉద్యోగాల కోసం.. దూర విద్య కోసం.. వివిధ వస్తువుల రిపేర్ కోసం ఎక్కువగానే వెతికారు. మహానగరాల వారీగా.. వారు శోధించిన అంశాలకు సంబంధించి చూస్తే..

ఢిల్లీ
- బ్యూటీ సెలూన్స్
- పెట్ కేర్ సర్వీసెస్
- వీసా కన్సల్టెంట్
- బ్యూటీపార్లర్స్
హైదరాబాద్
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్
- బ్యూటీ పార్లర్స్
- పెట్ కేర్ సర్వీసెస్
ముంబయి
- జాబ్ ట్రైనింగ్
- బ్యూటీ సెలూన్స్
- దూరవిద్య
చెన్నై
బ్యూటీసెలూన్స్
- ఏసీ సర్వీసెస్
- డయాగ్నస్టిక్ సెంటర్స్
బెంగళూరు
- బ్యూటీ సెలూన్స్
- కంప్యూటర్ రిపేర్
- సర్వీసెస్
- పెట్ కేర్ సర్వీసెస్
Tags:    

Similar News