చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది దీర్ఘ కాలిక లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. కోరనా తగ్గినా పలు ఆరోగ్య సమస్యలతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయితే కొంత మందిని వారాలు, నెలల కొద్ది విడవకుండా ఉంటున్న కరోనా బాధితుల్లో... చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలనే ఎదుర్కొంటున్నారట. అంతే కాకుండా కండరాల బలహీనత, బరువు తగ్గడం, కంటిచూపు సమస్య వంటి లక్షణాలు ఎక్కువుగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘ కాల కరోనాతో బాధపడుతున్న వారు ఎంత మంది ఉన్నారనే దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా 10 నుంచి 20 శాతం మంది కరోనా బాధితుల్లో వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా దీర్ఘకాల కొవిడ్ ప్రభావం ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ లాంగ్ కొవిడ్ బారిన పడుతున్నారని గుజరాత్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాకేశ్ పండిత్ తెలిపారు.
గరిష్టంగా ఆరు నెలల పాటు ఈ సమస్య వేధించవచ్చని చెబుతున్నారు. కొవిడ్ సమయంలో వెంటిలేటర్ సాయం తీసుకున్న వారిలో ఇప్పుడు ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. నాడీ వ్యవస్థ, కిడ్నీలు, జీర్ణాశయ, పేగుల పైనా ఈ లాంగ్ కొవిడ్ తీవ్ర ప్రభావం చూపిస్తోందని వెల్లడించారు. దీర్ఘకాల కొవిడ్ బారిన పడిన వారిలో అత్యంత తీవ్రమైన లక్షణం శ్వాస కోశ సమస్యేనని వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు కండరాలు బలహీనంగా ఉండటం, మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గడం, జుట్టు ఊడటం, కంటిచూపు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటున్నట్లు తెలిపారు.
కొంతమంది 15 నుంచి 20 కిలోల బరువు కూడా తగ్గినట్లు డాక్టర్ రాకేశ్ పండిత్ తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు కరోనా వేధిస్తున్న వారిలో గుండె చప్పుడు పెరగడం, ఒత్తిడి, ఆందోళన, నిల్చున్నప్పుడు కళ్లు తిరగడం వంటి సమస్యలు కూడా ఉంటున్నట్లు చెప్పారు.
అలాగే ఇప్పటి వరకు దీర్గల కరోనాకు ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే పెయిన్ కిల్లర్లు, మల్టీ విటామిన్లతో పాటు ఫిజికల్ థెరపీ, యోగా వంటి వాటితో ఈ సమస్యల నుంచి బయట పడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. లాంగ్ కొవిడ్ సమస్య ఎదుర్కొంటున్న వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు డైట్ పాటించాలని చెబుతున్నారు.