జగన్ టేబుల్ మీద ఉండే బాటిల్ ఏం చెబుతుంది?

Update: 2019-10-24 06:42 GMT
దేశ ప్రజలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో దాదాపు 80 శాతం శుద్ధమైన నీరు తాగని కారణంగానే. రక్షిత నీరు లేని కారణంగానే ఎక్కువ రోగాల బారిన ప్రజలు పడుతున్న పరిస్థితి. గడిచిన కొంతకాలంగా తాగే నీటి విషయంలో తీసుకునే జాగ్రత్తలు పెరుగుతున్నాయి. సామాన్యల సంగతే ఇలా ఉంటే.. అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారు మరెంత జాగ్రత్తగా ఉంటారో తెలియంది కాదు.
తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాగే నీటికి సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి వెలుగు చూసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిలా కాకుండా రోజూ ఠంచన్ గా ఏపీ సచివాలయానికి వెళ్లే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన ఛాంబర్ లో ఉన్నప్పుడు మంచినీళ్లు తాగాలనుకుంటే ఎవరికి ఆర్డర్ వేయరని చెబుతున్నారు.

ఎందుకంటే ఆయన టేబుల్ మీదనే కాపర్ వాటర్ బాటిల్ పెట్టుకున్నారు. చాలామంది మాదిరి మినరల్ వాటర్ ను తీసుకోకుండా.. ఇంటి నుంచి ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ వినియోగించే  నీటిని కాపర్ బాటిల్ లో ఉంచి.. వాటినే వినియోగిస్తారు. కాపర్ బాటిల్లో నీటిని తాగటం ఆరోగ్యానికి మంచిది కావటంతో.. యువనేత దాన్ని పక్కాగా ఫాలో అవుతున్నారని చెప్పాలి. ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే ప్యాకేజ్డ్ వాటర్ ను జగన్ దరికి రానివ్వరని తెలుస్తోంది.ఆరోగ్యం విషయంలో జగన్ ఎంత కేర్ ఫుల్ గా ఉంటారన్నది ఆయన వాడే వాటర్ బాటిల్ చెప్పేస్తుందంటున్నారు.
Tags:    

Similar News