కరోనాకు చెక్ చెప్పటానికి ఒక్క మాస్కు సరిపోదా? తాజా అధ్యయనం ఏం చెప్పింది?
కదిలే కాలంతో పాటు అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. మొదట్లో ఉండే అంచనాల్లోనూ మార్పు ఉంటుంది. కరోనా ఇందుకు మినహాయింపు కాదు. కరోనా గురించి ప్రపంచానికి తెలిసిన వేళ.. ముఖానికి మాస్కు పెట్టుకోవాలన్నది ప్రాథమికంగా తప్పనిసరిగా మారింది. అప్పటివరకు మాస్కు అంటే ఏమిటో తెలీని వారు సైతం.. ఇప్పుడు అది జీవితంలో ఒక భాగంగా మారింది. కరోనా వచ్చి ఏడాది అయిపోయి.. రెండో ఏడాదిలో అడుగు పెట్టటం.. కరోనా రెండో దశ దేశం మొత్తాన్ని వాయు వేగంతో విస్తరిస్తున్న వేళ.. మాస్కుల వినియోగానికి సంబంధించి సరికొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి.
ఇప్పటివరకు ముఖానికి సరైన మాస్కు ఒక్కటి సరిపోతుందన్న మాటలో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు నిపుణులు. డబుల్ మాస్కు తప్పనిసరిగా తేల్చి చెబుతున్నారు. అదేనండి.. మాస్కు మీద మాస్కు వేయటం తప్పనిసరి అని.. దాంతోనే కరోనా తీవ్రత తక్కువ అయ్యే వీలుందని చెబుతున్నారు. కరోనా అంతకంతకూ తీవ్రంగా విస్తరిస్తున్న వేళ.. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ జరిపిన తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. కొవిడ్ కు కళ్లాలు వేయాలంటే ఒక్క మాస్కు సరిపోదని.. డబుల్ మాస్కు తప్పనిసరిగా తేల్చారు.
దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాల్ని జామా ఇంటర్నల్ మెడిసిన జర్నల్ లో పబ్లిష్ చేశారు. ఇందులో పేర్కొన్న అంశాల్లో కీలకమైనవి చూస్తే..
- డబుల్ మాస్కు ధరించటం వల్ల వైరస్ కణాలు ముక్కు.. నోటి ద్వారా ప్రవేశించే అవకాశం లేదని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. మాస్కు పొరలు పెరగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. వాటిలో ఉన్న ఖాళీలు సరిగా పూడ్చినట్లుగా.. ముఖానికి బిగుతుగా ఉండటంచాలా అవసరమని తేల్చారు.
- మాస్కు ముఖానికి బిగుతుగా ఉంటే.. వైరస్ ప్రభావం నుంచి తప్పించుకునే వీలుందని చెబుతున్నారు. మెడికల్ ప్రొసీజర్ మాస్కులకు వడబోత సామర్థ్యం ఉన్నప్పటికి.. ఇవి ముఖానికి సరిగా సరిపోవు.
- వస్త్రంతో చేసిన మాస్కుతో సర్జికల్ మాస్కు కలిపి వేసుకుంటే ఆశాజనక ఫలితాలు ఉంటాయి. పురుషుల ముఖాల్లో ఉండే తేడాలను అనుసరించి మాస్కుల సామర్థ్యం భిన్నంగా ఉంటుంది.
- సర్జికల్ మాస్కులకు 40 - 60 శాతానికి పైగా సమర్థతను కలిగి ఉంటాయి. వస్త్రంతో తయారు చేసిన మాస్కులు 40 శాతానికి పైగా సమర్థతో ఉంటాయి. సర్జికల్ మాస్కుపై వస్త్రం మాస్కును ధరించటంతో వైరస్ ను నిలువరించే సామర్థ్యం మరో 20 శాతం అధికంగా ఉంటుంది.
- అదే సమయంలో వస్త్రం మాస్కుపై సర్జికల్ మాస్కును ధరిస్తే పెద్ద ప్రయోజనం ఉండదని తేల్చారు. ఎందుకంటే.. వదులుగా ఉన్న రెండు మాస్కులతో ఎలాంటి ప్రయోజనం లేదు.
ఈ అంశాల్ని చూసినప్పుడు.. మన చుట్టూ మాస్కు పెట్టుకున్న వారిలో 99 శాతం మంది సరైన పద్దతిలో మాస్కును ధరించటం లేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. సో.. మాస్కును ఉపయోగించే విషయంలో ఇప్పటివరకు అనుసరించిన విధానాల్ని పక్కన పెట్టి.. డబుల్ మాస్కును ధరించటం చాలా అవసరం. అది కూడా నిఫుణులు సూచించిన పద్దతుల్లో అన్నది మర్చిపోకూడదు.