కుప్పంలో చంద్రబాబుకి ఘోర అవమానం..ఏం జరిగింది?

Update: 2021-03-25 08:00 GMT
తెలుగు దేశం పార్టీ అధినేత - ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుకు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో ఊహించని ఘోర అవమానం జరిగింది.  కొందరు వ్యక్తులు చంద్రబాబును అవమానించేలా ప్రవర్తించారు. కుప్పంలో చంద్రబాబు - లోకేష్ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. గత నెలలో చంద్రబాబు కుప్పంలో పర్యటించిన సందర్భంగా స్థానిక టీడీపీ నేతలు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద చంద్రబాబు - లోకేష్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. అయితే , బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు ఫ్లెక్సీలకు నిప్పంటించారు.

ఈ ఘటనపై స్పందించిన టిడిపి నాయకులు - కార్యకర్తలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుప్పం పోలీసులకి ఫిర్యాదు చేశారు.‌ సమీపంలోని సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు కి కుప్పంలో అవమానం జరిగింది. మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయభేరి మోగించింది. టీడీపీ మద్దతుదారులు అధిక పంచాయతీల్లో డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గంలో 93 పంచాయతీలు ఉన్నారు. వీటిలో 4 మినహా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 74 పంచాయతీల్లో వైసీపీ జెండా ఎగరేయగా - 14 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. మరొక స్థానంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. బాబు సొంత గ్రామ పంచాయతీ అయిన కందులవారి పల్లెలో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి గెలవడంతో కాస్త పరువు దక్కింది.  ఇక పంచాయతీ ఎన్నికల ముగిసిన తర్వాత కుప్పంలో పర్యటిచింన చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. కుప్పం అభివృద్ధిని మరిచారని.. అలాగే కరోనా టైమ్ లో తమ బాగోగులు చూడలేదంటూ చంద్రబాబుపై మండిపడింది. దీంతో బాబు పర్యటన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇదే సమయంలో తాజాగా చంద్రబాబు  ఫ్లెక్సీలు దగ్ధం చేయడంతో మరోసారి కుప్పం రాజకీయం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News