దేశంలో ఓ వైపు కొవిడ్ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఇక మరణాలు లెక్కలేనన్నే ఉంటున్నాయి. ఏదీ ఏమైనా దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పలు రాష్ట్రాలు లాక్డౌన్లు, నైట్ కర్వ్ఫ్యూ విధించినా కేసుల పెరుగుదల ఆగడం లేదు. అయితే ఫస్ట్ వేవ్ వచ్చినప్పడు ప్రధానమంత్రి మోడీ వ్యాక్సిన్ వచ్చేదాకా ఆగండి.. అప్పటి వరకు మాస్క్ లు పెట్టుకోండి.. అంటూ ప్రచారం చేశారు. అయితే అనుకున్నట్లుగా ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్ నిలిచిందని మోడీ పలు సందర్భాల్లో చెప్పారు. దీంతో ప్రజలు కూడా కొవిడ్ నుంచి కోలుకున్నట్లే అని భావించారు.
కానీ గత మార్చి రెండో వారం నుంచి పాజిటివ్ కేసులు మూడు లక్షలకు పైగానే నమోదవుతున్నాయి. ఇక ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ ప్రతీసారి బడ్జెట్లో విపత్తు కింద కేటాయించిన రూ.35 వేల కోట్లను ఖర్చుపెట్టాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతీసారి బడ్జెట్లో నేషనల్ డిజాస్టర్ కింద, ఆరోగ్య సంక్షేమం కింద.. పోయిన ఏడాది ఆత్మ నిర్భర్ కింద అని చెప్పకపోయినా రూ. 35 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారట.
అయితే కొవిడ్ జాతీయ విపత్తు కిందకే వస్తుంది. దీంతో ఆ 35 వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రతీ ఒక్కరికి ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తే గానీ ఈ మహమ్మారి నుంచి తప్పించుకోలేం అంటున్నారు. ఒక వైపు కరోనా కారణంగా పరిస్థితి చేయి దాటిపోతుంటే ప్రధాని మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతీసారి వీడియో కాల్స్ లో మాట్లాడడం కాదు... సీరియస్ గా యాక్షన్ తీసుకుంటేనే ప్రమాదం నుంచి బయటపడవచ్చని అంటున్నారు.
ప్రస్తుతం ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు దేశ ప్రజలకు సరిపోవడం లేదు. దీంతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీలకు నిధులు కేటాయించి దేశ ప్రజలందరికీ సరిపోయేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. వైద్యలు బాగా పనిచేశారని చప్పట్లు కొట్టడం.. హెలీక్యాప్టర్ తో పూలు చల్లడం.. పళ్లాలతో సౌండ్ చేయడం.. కాదని.. వ్యాక్సిన్ ఉత్పత్తి ఆ రూ.35 వేల కోట్లు కేటాయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికైనా మోడీ స్పందించి వ్యాక్సిన్ ను ప్రజలందరికీ తొందరగా అందేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు.