2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీతో పోత్తు పెట్టుకుని ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఏపీకి కేంద్రంలోని బీజేపీ న్యాయం చేస్తుందని ఎంతో ఓపికతో ఎదురుచూసిన నాటి సీఎం చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. నిధులు రాక.. ప్రత్యేక హోదా ఇవ్వక బీజేపీ మోసం చేసింది. దీంతో చివరకు బీజేపీని పట్టుకుంటే మునిగిపోతామని గ్రహించిన చంద్రబాబు ఎన్నికల ముందర ఫ్లేట్ ఫిరాయించాడు. ఎన్నికల ముందు బీజేపీ నుంచి విడిపోయాడు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశాడు.
అయితే అదే బీజేపీ ఇన్ డైరెక్టుగా వైసీపీకి సపోర్టు చేసి టీడీపీ ఆర్థికమూలాలు దెబ్బతీసిందన్న టాక్ ఉంది.. ఎన్నికల సమయంలో టీడీపీకి ఎవరైతే ఆర్థికంగా సపోర్టుగా నిలుస్తారో వాళ్లను బెదిరించి.. ఐటీ దాడులు చేయించి వాళ్లను టీడీపీకి ఆర్థిక సపోర్టు చేయకుండా చేశారని ఏపీలో అందరూ అనుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ కూడా బీజేపీకి భయపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తే టీడీపీని ఏవిధంగా దెబ్బతీసిందో.. అదే విధంగా వైసీపీని కూడా బీజేపీ దెబ్బతీస్తుందని మేధావులు అంటున్నారు. జగన్ మీద కేసులు ఉన్నాయని.. వాటిని త్వరగా తీస్తారని అని ఒక సైడ్ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అందువల్ల బీజేపీకి జగన్ భయపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడని టీడీపీ అనుకూల మీడియా చర్చల మీద చర్చలు పెడుతోంది.
ఈ ప్రచారాన్ని ఎంతో కొంత మంది నమ్ముతారు కాబట్టి ఆ ఓట్లు వైసీపీ కోల్పోవడం ఖాయం. అందుకే వైసీపీ మేల్కొని బీజేపీని నమ్మకుండా ఆ పార్టీ మీద ఫైట్ చేస్తే మేలు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికైనా మేలుకోకపోతే వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ గతే పడుతుందంటున్నారు.రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద పోరాటం చేస్తే ప్రజలకు అర్థం అయ్యి ఆ ప్రభావంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎఫెక్ట్ కాదని అంటున్నారు.. చూద్దాం ఇది ఎలా టర్న్ అవుతుందో..