ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇది ఎప్పటినుంచో వినపడేముచ్చటే. అయితే పొగతాగడం నుంచి ఎంతమంది దూరంగా ఉంటున్నారు? ఇది చెప్పలేని విషయం. ఎందుకంటే ధూమపానం వల్ల మనిషి శరీరానికి ఎన్నో అనర్థాలు ఉన్నాయని తెలిసినా కూడా దీనికి అలవాటు పడతారు. ఇక ఇది వ్యసనంగా మారిపోతుంది. క్రమంగా శారీరకంగా, ఆర్థికంగా చాలా నష్టపోతారు. తెలియకుండా అలవాటు చేసుకున్న ఈ వ్యసనం నుంచి విముక్తి పొందాలని కొందరు గట్టిగా నిర్ణయించుకుంటారు. అందుకు చాలా కష్టపడతారు. అయితే ధూమపానం అలవాటయ్యాక మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా..?
పొగతాగడానికి బానిసైన వ్యక్తి దీని నుంచి విముక్తి పొందాలంటే కాస్త కష్టమే. అయితే విపరీతంగా సిగరెట్లు తాగే వ్యక్తి మెల్లమెల్లగా వాటిని దూరం పెడితే క్రమంగా ఎన్నో మార్పులు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ధూమపానానికి దూరంగా ఉన్నా కొద్దీ శరీరంలో అనేక రకాల మార్పులు జరుగుతాయని తెలిపారు. అయితే సాధారణంగా ఓ వ్యక్తి సిగరెట్ తాగితే... ఎనిమిది గంటల తర్వాత అతనికి మళ్లీ నికోటిన్ పై కోరిక కలుగుతుందని నిపుణులు వెల్లడించారు. 5-10 నిమిషాల పాటు విపరీతంగా ఉంటుందట. ఈ సమయంలో చూయింగ్ గమ్ వంటిది నమిలితే... ఆ కోరిక నుంచి కాస్త విముక్తి కలుగుతుందని సూచించారు. దానిని అధిగమించి సిగరెట్ కు దూరంగా ఉంటే చాలని చెబుతున్నారు. ఈ సమయంలో వ్యక్తి రక్తంలో నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం తగ్గుతూ ఉంటుందని పేర్కొన్నారు. పూర్తిగా పోకుండా... రక్తంలో కొంతశాతం ఉండే అవకాశం ఉంటుంది.
సిగరెట్ తాగి 12 గంటలు గడిచినా... మళ్లీ తాగకపోతే చాలా మార్పులు కనపడతాయి. ఇక కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం క్రమంగా తగ్గుతుంది. ఇక రెండు రోజుల పాటు ధూమపానానికి దూరంగా ఉంటే గుండె పనితీరు మెరుగవుతుంది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరంలోని మలినాలను వేగంగా బయటకు పంపవచ్చు. ఊపిరితిత్తులు, నరాల పనితీరు క్రమంగా బాగు పడుతుంది. అయితే ఈ సమయంలో కొన్ని సమస్యలు కూడా ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు. విశ్రాంతి లేకపోవడం, ఆకలి వేయడం, తలతిరగడం, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు వస్తాయట. ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా సిగరెట్ ముట్టకపోతే మంచిదని చెబుతున్నారు. రోజంతా బయటకు వెళ్లినప్పుడు సిగరెట్ తీసుకెళ్లవద్దని... క్రమంగా ఇలా నికోటిన్ నుంచి విముక్తి పొందవచ్చని వివరించారు.
సిగరెట్ మానేసిన రెండు రోజుల తర్వాత నికోటిన్ రక్తం నుంచి వెళ్లిపోతుంది. రెండు నెలల నుంచి మూడు నెలలలోపు ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఇక శరీరంలోని అన్ని అవయవాల పనితీరు క్రమంగా మెరుగవుతుంది. ఏడాది తర్వత నుంచి పూర్తి ఆరోగ్యవంతునిగా మారుతారు. ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తికి... పొగతాగడం అలవాటు లేని వ్యక్తితో పోలిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం రెండు రెట్లు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే క్రమంగా నికోటిన్ ఇలా విముక్తి పొందవచ్చు. ఇక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా పెద్దగా ఉండవు. కాబట్ట ధూమపానం నుంచి భయటపడాలంటే నెమ్మదిగా తగ్గిస్తే... ఆరోగ్యంగా ఉంటారు. వీటితో పాటు మంచి ఆహారం తీసుకుంటూ... రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.