చంద్రయాన్ సక్సెస్ అయ్యింది దేశవ్యాప్తంగా అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మీడియా ఆకాశానికెత్తేస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇస్రోకు అసలు సిసలు పరీక్ష ముందుంది.
చంద్రుడిపై ఇస్రో పంపిన చంద్రయాన్2 మాడ్యూల్ సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. అయితే చంద్రుడి ఉపరితలంపై ఎగుడుదిగుడు నేలపై.. అసలు ఎలా ఉంటుందో కూడా తెలియని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 2ను దింపడం.. నడిపించడం అంత సులువైన పనికాదని ఇస్రో చైర్మన్ కే.శివన్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం బాహుబలి రాకెట్ ద్వారా చంద్రయాన్2 ను ఇస్రో జూలై 22న ఆకాశంలోకి పంపింది. అది భూమి చుట్టూ పలుసార్లు తిరుగుతుంది. ఆ తరువాత మెల్లిమెల్లిగా బూస్టర్లను శాస్త్రవేత్తలు మండించడం ద్వారా చంద్రుడి కక్ష్యలోకి చేరుతుంది. చందమామ చుట్టూ కూడా కొన్ని సార్లు కక్ష్యలో తిరుగుతుంది. ఆ తర్వాత మెల్లిగా బూస్టర్లను మండించి చంద్రుడి ఉపరితలంపై ఇస్రో దించుతుంది. ఈ వ్యవహారం అంతా అత్యంత సంక్లిష్టం.. మరియు సమస్యాత్మకమైనది ఇస్రో వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రోవర్ చంద్రుడిపై దిగే చివరి 15 నిమిషాలే అత్యంత కీలకమట..
ఇస్రో రాకెట్ ప్రస్తుతం చంద్రయాన్ 2 ను భూమికి అతిదగ్గరగా ఉండే 170 కి.మీల దూరంలో వదిలేసింది. ఇక్కడ రోవర్ 23 రోజుల పాటు భూమి చుట్టూ తిరుగుతుంది. పూర్తిస్థాయి వేగం అందుకున్నాక చంద్రయాన్ 2ను చంద్రుడి కక్ష్యలోకి మళ్లిస్తారు. ఇందుకు 5 రోజుల సమయం పడుతుందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 2 మాడ్యూల్ 12 రోజుల పాటు చంద్రుడి చుట్టూ తిరిగాక మెల్లిగా వేగం తగ్గించుకుంటూ చంద్రుడికి దగ్గరగా వెళుతుంది. 48వ రోజున సెప్టెంబర్ 7న చంద్రుడిపై చంద్రయాన్ లోని రోవర్ తో కూడిన ల్యాండర్ ను కిందకు జారవిడుస్తుంది. ఇదే చంద్రయాన్ 2 లో కీలకఘట్టం.
దక్షిణ ధ్రువంలోని రెండు భారీ గుంతల మధ్య ఈ రోవర్ ల్యాండర్ ను దింపేందుకు శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. ల్యాండర్ వేగాన్ని నియంత్రిస్తూ సరిగ్గా ఈ ప్రాంతంలో దించాలి. దిగాక ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వస్తుంది. రోవర్ లోని సోలార్ ప్యానెల్స్ తెరుచుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకొని పరీక్షలు చేస్తుంది. కొన్ని రోజుల పాటు ల్యాండర్- రోవర్ లు భూమికి సంకేతాలు పంపేలా అభిముఖంగా ఉంటూ సూర్య కిరణాలు పడేలా యాంగిల్ లో ఉంటాయి. ఆ తరువాత పరిశోధించి ఇస్రోకు దాని ఫలితాలను ఫొటోలను పంపిస్తాయి. ఇలా ఇంతటి క్లిష్టమైన ప్రక్రియ పూర్తి కావాలంటే కనీసం 54 రోజులు పడుతుంది. చూడాలి మరి మన చంద్రయాన్ ఏం చేస్తుందో..