మోడీ ఆవిష్కరించిన ప్రాపర్టీ కార్డుతో ఏం జరుగుతుంది?

Update: 2020-10-11 12:42 GMT
వినూత్న కార్యక్రమానికి తెర తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పటివరకు ప్రతి ఒక్కరి ఉనికిని చాటేలా ఆధార్ కార్డు ఉంటే.. ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి ఆస్తి కార్డులు(ప్రాపర్టీ కార్స్) ఇవ్వనున్నారు. ఈ రోజున స్వమిత్వ పేరుతో ప్రాపర్టీ కార్డుల్ని ఆవిష్కరించారు. ఇందులో సదరు కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివరాలు ఉండనున్నాయి. ఈ కార్డులో ఇంటి యజమాని వివరాలతో పాటు.. ఇతరుల సమాచారం ఉంటుంది.

అంతేకాదు.. వారికి ఉన్న ఆస్తుల్ని కూడా అందులో పేర్కొంటారు. పేదలకు ఈ కార్డులు ఆస్తులని.. వీటితో రుణాలు పొందే వీలు ఉంటుందని చెబుతున్నారు. పేద ప్రజలకు సాయం చేసేలా ఈ కార్డులు ఉండనున్నట్లు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా వీటిని అందిస్తాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన క్రమంలో.. ప్రధాని మోడీ కొందరితో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం గురించి వివరించారు.

దేశంలోని 763 గ్రామాల్లో ఈ కార్యక్రమం కింద లబ్ధిదారులకు కార్డుల్ని అందించనున్నారు. 2024 నాటికి దేశంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. గతానికి భిన్నంగా ఈ కార్డులతో గ్రామీణులు బ్యాంకుల నుంచి సులువుగా రుణాలు తీసుకునేందుకు వీలు ఉంటుంది.
Tags:    

Similar News