ఇపుడీ విషయంపైనే తెలంగాణా తెలుగుదేశంపార్టీలో చర్చలు జరుగుతోంది. వారం పదిరోజుల్లో టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిపోవటం దాదాపు ఖాయమైపోయిందనే అనుకోవాలి. తన మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్వయంగా రమణే చెప్పారు. అంటే తొందరలోనే టీడీపీని వదిలేయటానికి రమణ నిర్ణయించుకున్న విషయం అర్ధమైపోతోంది. కాకపోతే ముహూర్తమే ఎప్పుడన్నది బయటకు రాలేదంతే.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో టీడీపీ బలహీనపడిందన్నది వాస్తవం. దానికితోడు ‘ఓటుకునోటు’ కేసులు చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుండి విజయవాడ పారిపోయిన తర్వాత తెలంగాణా రాజకీయాల్లో ప్రత్యక్షంగా కనబడలేదు. ఒకరకంగా తెలంగాణాలో పార్టీని గాలికొదిలేశారనే అనుకోవాలి. ముందు చంద్రబాబు తర్వాత లోకేష్ కూడా పార్టీని పట్టించుకోవటం మానేయటంతో పార్టీ పరిస్ధితి చుక్కాని లేని నావలాగ తయారైపోయింది.
గడచిన ఏడేళ్ళుగా రమణే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. నిజానికి రమణ అంత గట్టి నేతేమీ కాదు. కాకపోతే బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావటంతో చంద్రబాబు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే రమణ స్ధానంలో వేరొకరు అధ్యక్ష బాధ్యతలు తీసుకోవటానికి ముందుకు రావటంలేదు. తెలంగాణా పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకున్నా ఒరిగేదేమీ లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే పార్టీ ఇక్కడ దాదాపు కోమాలో ఉన్న పేషంట్ లాగ అయిపోయింది.
ఏదో పార్టీ ఉందంటే ఉందన్నట్లుగా తయారైపోయింది పరిస్ధితులు. పార్టీకి దన్నుగా నిలిచే నేతలు లేరు. నేతలు లేకపోవటంతో క్యాడర్ కూడా చెల్లా చెదురైపోయింది. గట్టి నేతలు అనుకున్నవారిలో కొందరు టీఆర్ఎస్ లోను మరికొందరు కాంగ్రెస్ లోను చేరిపోయారు. అలాగే మరికొందరు బీజేపీలోకి దూకేశారు. ఏ పార్టీలోను చేరలేని వాళ్ళే ఇంకా టీడీపీలో కంటిన్యు అవుతున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో హఠాత్తుగా రమణ కూడా టీడీపీని వదిలేస్తున్నారు. అధ్యక్షుడే పార్టీని వదిలేస్తే ఇక పార్టీలో ఉండేదెవరబ్బా ? అనే చర్చ పెరిగిపోతోంది.
తెలంగాణాకు అధ్యక్షుడిని వెతకటం చంద్రబాబుకు అంత ఈజీకాదు. ఎందుకంటే ఏమి చేసినా తెలంగాణాలో పార్టీ బతికి బట్టకట్టేది లేదనే విషయం ఇప్పటికే స్పష్టమైపోయింది. కేసీయార్ కు వ్యతిరేకంగా చంద్రబాబు తెలంగాణాలో తిరిగేతేనే పార్టీ పుంజుకునే అవకాశాలుంటాయి. ఇది జరిగేపనికాదని అందరికీ తెలుసు. కేసీయార్ కు వ్యతిరేకంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబే రాజకీయం చేయనపుడు తెలంగాణా అధ్యక్షునికి ఏమవసరం ఉంది. ప్రధాన ప్రత్యర్ధి గురించి మాట్లాడేందుకే భయపడుతుంటే ఇక నేతలు, క్యాడర్ మాత్రం ఏమి చేస్తారు. అందుకనే తెలంగాణాలో పార్టీ పరిస్దితి ఇలాగైపోయింది.