మోడీని ఓటమి ఖాయమా...విపక్ష వ్యూహమదే అయితే...?

Update: 2023-01-17 14:30 GMT
దేశంలోని విపక్షాల తీరు మరోమారు ప్రధానిగా నరేంద్ర మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించేటట్ట్లుగా ఉంది అని అంటున్నారు. నిజానికి బీజేపీ గ్రాఫ్ 2014 కంటే 2019లో తగ్గింది. కానీ విపక్షాల బలం కూడా తగ్గడమే బీజేపీకి వరంగా మారుతోంది. వ్యూహాలు లేని విధంగా విపక్షాలు చేస్తున్న రాజకీయాలే మోడీని మళ్లీ గద్దెనెక్కేలా చేస్తున్నాయని అంటున్నారు.

ఈ రోజున దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. నిజానికి ప్రాంతీయ పార్టీలు అంటే బీజేపీకి పడదు కానీ అవే బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువస్తున్నాయన్న సంగతి ఇక్కడ చాలా ముఖ్యం. ప్రాంతీయ పార్టీలు గిరి గీసుకుని కూర్చుంటాయి. అతి చేస్తూ పోతాయి. తమ సొంత రాష్ట్రం, దాని ప్రయోజనాలు తప్ప దేశం గురించి ఆలోచన చేయవు.

ఇది నిజంగా బీజేపీకి కలసివస్తోంది. ప్రాంతీయ పార్టీలకు కొన్ని లొసుగులు ఉంటాయి. అవి కేంద్రంతో దోస్తీ చేస్తూ ఉంటాయి. ఆ విధంగా బీజేపీ ఈతర పార్టీలలో చీలిక వల్ల కూడా కాషాయం పార్టీకి లాభం కలుగుతోంది. ఇక ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్న టీయారెస్ ని బీయారెస్ గా మార్చి కేసీయార్ జాతీయ రంగంలోకి దూకారు. ఆయన ఆశలు ఆయనకు ఉన్నాయి.

కేసీయార్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు. దాంతో ఈసారి ప్రధానికే గురి పెట్టేశారు అని అంటున్నారు. ఆయన మరో పార్టీతో కలవరు.కలిసినా తమ ఆధిక్యాన్ని తక్కువ చేసుకోలేరు అని అంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రధాని రేసులో ఉన్నారు. ఆయన మూడు సార్లు సీఎం ని అయ్యాను కాబట్టి ఇక తనకు ప్రమోషన్ కావాలనుకుంటున్నారు. అందుకే ప్రధాని మంత్రి పదవి మీద కన్నే కన్నేశారు అని అంటున్నారు.

అదే విధంగా చూస్తే బీహార్ సీఎం నితీష్ కుమార్. ఈయన రాజకీయ పొత్తులకు విధానాలకు నిలకడ లేదు అని విమర్శలు ఉన్నాయి. ఎలాగైనా పొత్తులు పెట్టుకుని సీఎం కావడమే తమ లక్ష్యం అని ఆయన అంటూంటారు. అది సాధ్యపడింది. ఇపుడు ఆయన ప్రధాని రేసులోకి దూసుకుని వచ్చారు. తన జీవిత కాల కోరికను 2024లో నెరవేర్చుకుందామని చూస్తున్నారు. అందుకోసం ఆయన కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

మరో పేరుగా  చెప్పాలంటే శరద్ పవార్ ఉన్నారు. ఈయన ఎనిమిదిన్నర పదులు దాటిని సీనియర్ మోస్ట్ వృద్ధ నాయకుడు. శరద్ పవార్ కూడా చాన్స్ దొరికితే చాలు ప్రధాని కుర్చీని పట్టేద్దామని చూస్తున్నారు. మరి ఆయన కూడా లక్ నే పూర్తిగా నమ్ముకున్నారు. వీరితో పాటుగా బెంగాల్ దీదీ మమతా బెనర్జీ ప్రధాని పదవి కోసం పరితపిస్తున్నారు. ఆమె మూడు సార్లు బెంగాల్ వంటి పెద్ద స్టేట్ కి సీఎం గా ఉన్న్నారు. ఇక ఢిల్లీ నుంచి దేశాన్న్ ఏలడమే తన లక్ష్యమని ఆమె అంటున్నారు.

ఇలా ఎవరికి వారుగా ప్రధాని రేసులో ఉన్నారు. విపక్షాల మధ్య ఈ విషయంలో అనైక్యత అయితే స్పష్టంగా ఉంది. అందరూ పెద్దలే. అందరూ జాతీయ నాయకులే అందరూ యోగ్యులే. కానీ అక్కడ ఉన్నది ఒక్కటే కుర్చీ. ఆ విషయంలో ఏకాభిప్రాయానికి విపక్షం రాలేకపోతోంది.

ఇక్కడ చెప్పుకోవాల్సిన తమాషా మరోటి ఉంది. అదేంటి అంటే ఈ రోజుకు కూడా బీజేపీని దేశంలో అత్యధిక రాష్ట్రాలలో ఎదిరించి నిలిచే పెద్ద పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీని పక్కన పెట్టి ఇతర ప్రాంతీయ పార్టీలు తామే ప్రధాని రేసులో ఉంటున్నామని చెప్పుకోవడం. భారత్ జోడో యాత్ర తరువాత రాహుల్ గాంధీ గ్రాఫ్ గణనీయంగా పెరిగింది.

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కి వందకు తగ్గకుండా ఎంపీ సీట్లు వస్తాయని అంటున్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని పెద్దన్నగా పెట్టుకుని విపక్షాలు అన్నీ కూటమి కడితే కచ్చితంగా దేశంలో బీజేపీకి గట్టి పోటీ ఏర్పడుతుంది. అంతే కాదు బీజేపీ పరాజయానికి అది దారి తీస్తుంది. కానీ అనవసర అతిశయాలతో విపక్షం తమలో తాము పోటీ పడుతూ బీజేపీని అలా ఫ్రీగా వదిలేస్తున్నాయని అంటున్నారు.

వచ్చే ఏడాది ఎన్నికల కోసస్మ్ బీజేపీకి ఒక పక్కా ప్లాన్ ఉంది. దాని ప్రకారం గెలుచుకుని రావాలని చూస్తోంది. మోడీ క్రేజ్ కి అమిత్ షా వ్యూహాలు తోడుగా నిలిస్తున్నాయి. కానీ విపక్ష కూటమిలో ఉద్ధండ నేతలు ఉన్నా అందరి మధ్యన విభేదాలు ఉండడంతో పాటు ఎవరికి వారు తామే ప్రధానమంత్రి అభ్యర్ధులుగా చెప్పుకోవడమే బీజేపీకి అతి పెద్ద ప్లస్ పాయింట్.

విపక్షంలోని ఈ అనిక్యత తమకు ఎపుడూ శ్రీరామ రక్షగా  ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సైతం 2024లో మళ్లీ గెలిచేందుకు రూట్ మ్యాప్ ని రెడీ చేస్తున్నాయి. పైగా మీ ప్రధాని అభ్యర్ధి ఎవరు అంటూ విపక్షాన్ని వారి రాజకీయాన్ని నిలదీస్తోంది బీజేపీ. మరి ఈ పరిస్థితి మారినపుడే బీజేపీని ఓడించడం సాధ్యపడుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News