ఇప్పటివరకు శాస్త్రపరిశోధనకు మాత్రమే పరిమితమైన అంతరిక్ష ప్రయాణం.. ఇప్పుడు పర్యాటక రంగంలోకి అడుగు పెట్టనుంది. పూర్తి వాణిజ్య రంగంలోకి అడుగుపెట్టేలా సాగనున్న ఈ తొలి ప్రయాణంలో తెలుగమ్మాయి శిరీష బండ్ల వెళ్లనున్న విషయం తెలిసిందే. అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో భారతీయురాలిగా గుర్తింపును సొంతం చేసుకోనున్నారు. తెలుగు నేల వరకు ఆమె మొదటివారు అవుతారు. దీంతో.. నిన్నటి వరకు ఆమె గురించి ఏమీ తెలీని వారికి.. ఇప్పుడు యావత్ భారతావనిలో అందరికి సుపరిచితం కానున్నారు.
ఇంతకీ ఆమె జర్నీ చేయనున్న వ్యోమనోక ఎలా ఉంటుంది? అదెలా పని చేస్తుంది? అంతరిక్షంలో ఎంతవరకు వెళ్లి వస్తారు. అంతరిక్షంలోకి వెళ్లటం ఓకే.. తిరిగి ఎలా వస్తారు. వారు ప్రయాణించే వ్యోమనోక ఎలా పని చేస్తుంది? వారి మొత్తం ప్రయాణం ఎంతసేపు సాగుతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. చూసినంతనే విమానంలా కనిపిస్తుంది శిరీష ప్రయాణించే అంతరిక్ష నౌక. యూనిటీ-22గా వ్యవహరించే ఈ వ్యోమనౌకను చూసినంతనే రెక్కల విమానంలా కనిపిస్తుంది. దీన్ని వీఎంఎస్ ఈవ్ అనే ఒక ప్రత్యేక విమానానికి అమరుస్తారు.
ఈ విమానం యూనిటీ-22ను నేల నుంచి 15వేల మీటర్ల ఎత్తు వరకు తీసుకెళుతుంది. ఆ తర్వాత యూనిటీ-22 ఆ విమానం నుంచి విడిపోతుంది. ఈ దశలోనే యూనిటీ-22లోని రాకెట్ ఇంజిన్లు పని చేయటం మొదలవుతాయి. ఫలితంగా దీని వేగం గంటకు 4వేల కిలోమీటర్లకు పెరుగుతుంది. దాదాపు 90 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లాక అది సబ్ ఆర్బిటల్ ఎత్తుకు చేరుకుంటుంది.
ఆ సమయానికి వ్యోమ నౌక ఒక్కసారిగా భారరహిత స్థితికి చేరుకుంటుంది. కొన్ని నిమిషాల పాటు వ్యోమనౌకలో ప్రయాణించే వారంతా భారరహిత స్థితిలోకి వెళతారు. కాసేపటి తర్వాత మళ్లీ ఇది భూ వాతావరణంలోకి వచ్చేస్తుంది. ఆ సమయంలో గ్లైడర్ లా కిందికి వచ్చి.. వీల్స్ సాయంతో స్పేస్ షటిల్ మాదిరి రన్ వే మీద దిగుతుంది. దీంతో.. తొలి వాణిజ్య అంతరిక్ష ప్రయాణం ముగుస్తుంది. ఇలా.. మన తెలుగమ్మాయి అంతరిక్ష జర్నీ జరుగుతుందని చెబుతున్నారు.