తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పేరుతో భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్ గా మార్చేశారు. అలాగే ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. అనుబంధ సంఘాల అధ్యక్షులను సైతం నియమిస్తున్నారు.
కాగా సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్‌ఎస్ సభ ఉంటుందని చెబుతున్నారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య అన్యోన్య సంబంధాలు ఉన్న నేపథ్యంలో సభ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. అయితే ఏపీ రాజధాని విషయంలో బీఆర్‌ఎస్ కేసీఆర్ ఏం చెబుతారనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఏపీలో అధికార వైసీపీ తప్ప మిగతా పార్టీలన్నీ ఒకే ఒక రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నాయి. ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానులని అంటోంది. ఇప్పుడీ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఓవైపు వైసీపీ మూడు రాజదానులకు అనుకూలంగా రాష్ట్రమంతా సభలు, ర్యాలీలు, గర్జనలు నిర్వహిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఇలా అన్ని పార్టీలు అమరావతికే జైకొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్ ఏపీ రాజదాని వ్యవహారంలో తన వైఖరిని ప్రకటించడం తప్పనిసరి. అయితే ఒక రకంగా ఏపీ రాజధాని అమరావతేనని కేసీఆర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టేనని అనుకుంటున్నారు. దీనికి రెండు కారణాలను చూపుతున్నారు. బీఆర్‌ఎస్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నార ని తెలుస్తోంది.
అలాగే కేసీఆర్ తన తొలి బహిరంగ సభను కూడా గుంటూరు – విజయవాడ మధ్యే నిర్వహించనున్నారు. తద్వారా తన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని, బహిరంగ సభను రెండింటినీ అమరావతి ప్రాంతంలోనే నిర్వహిస్తుండటంతో కేసీఆర్ వైఖరి కూడా అమరావతికే అనుకూలమని చెప్పవచ్చని అంటున్నారు. మరి కేసీఆర్ తన స్నేహితుడు జగన్ మోహన్ రెడ్డి మనోగతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారా అనేదే కీలకం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.